విజయవాడలో సంపూర్ణ లాక్‌డౌన్‌పై ప్రభుత్వం యూటర్న్‌

By సుభాష్  Published on  24 Jun 2020 8:40 AM IST
విజయవాడలో సంపూర్ణ లాక్‌డౌన్‌పై ప్రభుత్వం యూటర్న్‌

ఏపీలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో కేసుల సంఖ్య పెరిగిపోయాయి. అయితే కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది ప్రభుత్వం. ఇక విజయవాడలో కూడా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున ఈనెల 26 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌ ఉపసంహరించుకున్నారు. 26 నుంచి విజయవాడలో లాక్‌డౌన్‌ అమలులోకి రానుందని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. లాక్‌డౌన్‌తో మెడికల్‌ షాపులు, అత్యవసర షాపులు మినహాయించి అన్నీ షాపులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు అత్యవసరం కాని ప్రైవేటున, పబ్లిక్‌ కార్యాలయాలను సైతం మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారరు. కానీ ప్రకటన వెలువడిన కొన్నిగంటల్లోనే యూటర్న్‌ తీసుకున్నారు. ఎలాంటి లాక్‌డౌన్‌ లేదని ప్రకటించారు. అయితే ప్రభుత్వం ముందుగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించి మళ్లీ ఎందుకు వెనక్కి తీసుకుందో తెలియాల్సి ఉంది.

కాగా, ఏపీలో మంగళవారం కొత్తగా 462 మందికి పాజిటివ్‌గా కేసులు నమోదయ్యాయి. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 407 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 40 మంది.. 15 మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9834కు చేరింది.

ఇక గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలులో ముగ్గురు, గుంటూరులో ఒకరు, కడపలో ఒకరు చొప్పున మొత్తం 8 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ 119 మంది మృతి చెందారు. ఇక ఇప్పటి వరకూ కరోనా నుంచి 4592 మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, 5123 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక తాజాగా 129 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇలా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుందని తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. అదుపులోకి రాలేకపోతోంది. ఇందులో ప్రజల తప్పిదాలు కూడా చాలానే ఉన్నాయి. లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చినా తర్వాత ఎలాంటి మాస్కులు ధరించ కూడా రోడ్లపైకి వస్తున్న వారు చాలానే ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు తీసుకున్నజాగ్రత్తలు తర్వాత పెద్దగా పట్టించుకోకపోవడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించకపోవడం కూడా కేసులు పెరగడానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story