రంగా ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి..

Vangaveeti Ranga Birthday Celebrations. విజ‌య‌వాడ‌లో స్వర్గీయ వంగవీటి మోహన రంగా అభిమానులు ఆయ‌న‌

By Medi Samrat  Published on  4 July 2022 6:32 AM GMT
రంగా ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి..

విజ‌య‌వాడ‌లో స్వర్గీయ వంగవీటి మోహన రంగా అభిమానులు ఆయ‌న‌ 75వ జయంతి వేడుకలను ఘనంగా జ‌రుపుకుంటున్నారు. ఈ వేడుక‌ల‌లో రంగా తనయుడు వంగవీటి రాధా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం రాధా మాట్లాడుతూ.. వంగవీటి రంగా పేదల పెన్నిది అని అన్నారు.

రంగా ఒక విజయవాడకు మాత్రమే చెందిన వ్యక్తి కాదని.. రంగా అభిమానులు అన్నిపార్టీల్లో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రంగా అభిమానులు జయంతి వేడుకలు జరుపుకుంటున్నారని.. నా తండ్రి రంగా ఆశయాలను కొనసాగిస్తానని తెలిపారు. రంగా కొడుకుగా పుట్టడం త‌న‌ అదృష్టం అని అన్నారు. రంగా ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి.. నా తండ్రి రంగా ఒక సామజిక వర్గానికి మాత్రమే చెందిన వ్యక్తి కాదని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు వెన్నంటు ఉండి, బడుగుల సమస్యలపై పోరాడిన వ్యక్తి రంగా అని తెలిపారు.

Next Story
Share it