అంగ‌రంగ వైభవంగా వంగవీటి రాధా వివాహం.. హాజ‌రైన ప్ర‌ముఖులు

విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుక అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది.

By Medi Samrat  Published on  23 Oct 2023 7:04 AM IST
అంగ‌రంగ వైభవంగా వంగవీటి రాధా వివాహం.. హాజ‌రైన ప్ర‌ముఖులు

విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుక అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. వంగవీటి రాధాకృష్ణ.. పుష్పవల్లిని వివాహ‌మాడారు. ఈ వేడుక‌కు ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ఆదివారం రాత్రి విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో జరిగిన ఈ వివాహ‌ వేడుకకు జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.


రాధా వివాహ‌వ‌డుక‌కు హాజ‌రైన వారిలో బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు కొడాలి నాని, కొలుసు పార్థసారథి, వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్‌, మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, జలీల్‌ఖాన్‌, నాయకులు యార్లగడ్డ వెంకట్రావు తదితరులు ఉన్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, రంగా, రాధా అభిమానులు కూడా వివాహవేడుకలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story