విజయవాడ నుండి ఢిల్లీకి మరో డైరెక్ట్ ఫ్లైట్

విజయవాడ నుండి న్యూఢిల్లీకి ప్రయాణించే విమాన ప్రయాణీకులకు ఓ శుభవార్త. ఇండిగో ఎయిర్ లైన్స్ విజయవాడ- న్యూఢిల్లీ మధ్య కొత్త డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్‌ను నడపనుంది.

By Medi Samrat  Published on  16 Aug 2024 8:00 PM IST
విజయవాడ నుండి ఢిల్లీకి మరో డైరెక్ట్ ఫ్లైట్

విజయవాడ నుండి న్యూఢిల్లీకి ప్రయాణించే విమాన ప్రయాణీకులకు ఓ శుభవార్త. ఇండిగో ఎయిర్ లైన్స్ విజయవాడ- న్యూఢిల్లీ మధ్య కొత్త డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్‌ను నడపనుంది. సెప్టెంబర్ 14 నుండి ఈ ఫ్లైట్ ను ప్రారంభించనున్నారు. ఇది రాష్ట్ర రాజధాని- దేశ రాజధాని మధ్య మూడవ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు X లో దీనిపై ప్రకటన చేశారు. “సెప్టెంబర్ 14, 2024 నుండి ఇండిగో విజయవాడ- ఢిల్లీ మధ్య అనుసంధానం చేస్తూ రోజువారీ విమాన సర్వీసును ప్రకటించినందుకు సంతోషిస్తున్నాము. ఈ కొత్త కనెక్షన్ అమరావతి- ఢిల్లీ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది." అని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం.. ఇండిగో విమానం ఢిల్లీ నుంచి ఉదయం 8.10 గంటలకు బయలుదేరి 10.40 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి రోజూ ఉదయం 11.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.40 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది.

Next Story