మాజీ మంత్రి నారాయణకు ఊరట
Relief for former minister Ponguru Narayana. ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగురోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయంటూ
By Medi Samrat Published on
6 Sep 2022 11:22 AM GMT

ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగురోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఊరట లభించింది. ఈ కేసులో హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో నారాయణతో పాటు లింగమనేని రమేశ్, రామకృష్ణ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ అంజనీ కుమార్ సహా పలువురు వ్యక్తులను ఆళ్ల రామకృష్ణారెడ్డి నిందితులుగా పేర్కొన్నారు. వీరందరిపై ఏపీ సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నారాయణ, అంజనీకుమార్, లింగమనేని రమేశ్ లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు నారాయణ, అంజనీకుమార్‌లకు మాత్రమే మందుస్తు బెయిల్ మంజూరు చేసింది.
Next Story