విజయవాడ మధురా నగర్‌లో అగ్రిగోల్డ్ బాధితులు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుకు సీఎం జగన్ అండగా ఉన్నారన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో నీచ రాజకీయాలు చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకోవాలని ప్రయత్నాలు చేశార‌ని.. సీఎం జగన్ పరిపాలనలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగిందని అన్నారు. టీడీపీ నేతలు అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను గాలికి వదిలేశారని.. సీఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాట నెరవేర్చారని అన్నారు.

సీఎం జగన్ రూ.900 కోట్లు అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాలో జమ చేశారని పేర్కొన్నారు. గ్రామ స‌చివాల‌యాల ద్వారా సీఎం రాష్ట్రంలో రూ. 70 వేల కోట్ల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారని అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ పేదరికం నిర్మూలన చేస్తున్నారని.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన చేస్తున్నారని అన్నారు. నాడు-నేడు ద్వారా నగర అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని.. సీఎం జగన్ పై చంద్రబాబు చేస్తున్న విమర్శలు సరికాదని.. సీఎం జగన్ ప్రభుత్వం.. పేదల ప్రభుత్వం అని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు.


సామ్రాట్

Next Story