ఆయ‌న‌ను ఓడించేందుకు కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలి: కేశినేని శివనాథ్

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పాస్టర్ల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) వైసీపీ ప్రభుత్వ పాలనను.. రాక్షస పాలనగా అభివర్ణించారు

By Medi Samrat  Published on  17 April 2024 2:45 PM IST
ఆయ‌న‌ను ఓడించేందుకు కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలి: కేశినేని శివనాథ్

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పాస్టర్ల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) వైసీపీ ప్రభుత్వ పాలనను.. రాక్షస పాలనగా అభివర్ణించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని ఓడించేందుకు కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి శివనాథ్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి హాజరయ్యారు. ఊర్మిళా నగర్‌లోని సంకుర్తి పంక్షన్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలని కోరుతూ గుడ్‌ హోం మినిస్ట్రీస్‌ మాథ్యూస్‌, రెవరెండ్‌ చిన్నప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

సమాజంలోని అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని ఓడించాలని.. మంచి భవిష్యత్తు కోసం అందరూ కలిసి రావాల్సిన అవసరముందని కేశినేని చిన్ని అన్నారు. ఈ సమావేశానికి పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు మత పెద్దలు హాజరయ్యారు. కులమతాలకు అతీతంగా ఐక్యత కోసం పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో మార్పు తీసుకురావడానికి అందరూ కలిసి పనిచేయాలని కేశినేని శివనాథ్ కోరారు.

Next Story