సాంకేతిక కార‌ణాల‌తో నిలిచిన ఆర్ఆర్ఆర్ షో.. థియేట‌ర్ ఫ‌ర్నీచ‌ర్ ధ్వంసం

Fans Damage Theatre Furniture in Vijayawada.యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన చిత్రం రౌద్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2022 2:03 PM IST
సాంకేతిక కార‌ణాల‌తో నిలిచిన ఆర్ఆర్ఆర్ షో.. థియేట‌ర్ ఫ‌ర్నీచ‌ర్ ధ్వంసం

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన చిత్రం 'రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)'. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం నేడు(శుక్ర‌వారం) తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియానే క‌నిపిస్తోంది. థియేట‌ర్ల వ‌ద్ద అభిమానుల హంగామా మామూలుగా లేదు. భారీ కటౌట్లు, పూజలతో పాటు నినాదాలతో హోరెత్తించారు. ప‌లు చోట్ల బాణా సంచా కాలుస్తూ సంద‌డి చేశారు. మొత్తంగా థియేట‌ర్ల వ‌ద్ద పండుగ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

థియేట‌ర్ల వ‌ద్ద ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా చ‌ర్య‌లు తీసుకున‌ప్ప‌టికీ కొన్ని చోట్ల స్వ‌ల్ప ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. సాంకేతిక కార‌ణ‌ల‌తో విజ‌యవాడ‌లోని అన్న‌పూర్ణ థియేట‌ర్‌లో చిత్రం మ‌ధ్యలో నిలిచిపోయింది. దీంతో అభిమానులు హ‌ద్దులు దాటారు. థియేట‌ర్ లోని వ‌స్తువులు, అద్దాలు ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని ప‌రిస్థితిని అదుపులోకి తీసుకువ‌చ్చారు. కొంత స‌మ‌యం అనంత‌రం థియేట‌ర్ యాజ‌మాన్యం తిరిగి షోను కొన‌సాగించింది. కాగా.. అభిమానులు థియేట‌ర్‌లో చేసిన ర‌చ్చ‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story