ఏపీకి రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్ తో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న పాదయాత్రను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. యాత్రను కొనసాగించాలంటూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లను అన్నిటినీ కలిపి హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై విచారణ ముగిసినట్లు ప్రకటించిన కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.
విచారణ సందర్భంగా అమరావతి రైతులు గతంలో కోర్టుకు తెలిపిన విషయాలతో పాటు మరికొన్ని అంశాలను తాజాగా విచారణలో ప్రస్తావించారు. యాత్రలో కోర్టు చెప్పినట్లుగా 600 మంది మాత్రమే పాల్గొంటామని, ఎవరైనా వెళ్ళిపోతే వారి స్థానంలో కొత్త వారు వచ్చేలా అనుమతి ఇవ్వాలని కోరారు. ఇక యాత్ర ద్వారా తలెత్తుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని యాత్రను నిలుపుదల చేయాలని ప్రభుత్వం వాదించింది. ఈ వాదనలన్నీ విన్న కోర్టు తీర్పును రిజర్వ్ ను చేస్తుట్లు తెలిపింది.