రేపు సీఎం జ‌గ‌న్ విజ‌య‌వాడ ప‌ర్య‌ట‌న‌

సీఎం జగన్‌ రేపు విజయవాడ పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం

By Medi Samrat  Published on  6 Dec 2023 6:51 PM IST
రేపు సీఎం జ‌గ‌న్ విజ‌య‌వాడ ప‌ర్య‌ట‌న‌

సీఎం జగన్‌ రేపు విజయవాడ పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, భూమిపూజ కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు షెడ్యూల్ విడుద‌ల చేశారు. ఉదయం 8.35 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం చేరుకుని అక్కడ పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. అనంతరం తాడేపల్లి చేరుకుంటారు.

Next Story