దుర్గమ్మ సేవలో సీఎం

CM Jagan Offers Prayers to Vijayawada Durgamma Temple. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదివారం పాల్గొన్నారు.

By Medi Samrat  Published on  2 Oct 2022 11:10 AM GMT
దుర్గమ్మ సేవలో సీఎం

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదివారం పాల్గొన్నారు. శ్రీసరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మ‌వారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జ‌గ‌న్‌ క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన ముఖ్యమంత్రి జగన్ కు ఆలయం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఆలయ స్థానాచార్యులు విష్ణు బట్ల శివప్రసాద్ శర్మ పరివేష్టితం నిర్వహించగా, పరివేష్టితం ధారణతో అమ్మ వారికి సమర్పించే పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను ముఖ్యమంత్రి తలపై పెట్టుకుని ఆలయంలోకి అడుగు పెట్టారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రాలతో అంతరాలయంలోకి ప్రవేశించి .. శ్రీసరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మ వారి పేరున సమర్పించారు. అంతరాలయంలో ప్రధాన అర్చకులు లింగం బట్ల దుర్గాప్రసాద్, ఇతర అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచన మండపంలో వేద పండితులు సీఎం జగన్ కి ఆశీర్వచనం పలికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.


Next Story
Share it