రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం శుభ‌వార్త

AP Govt Good News For Farmers. ఏపీలోని రాజధాని ప్రాంత‌ రైతులకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల‌కు రావాల్సిన‌

By Medi Samrat  Published on  16 Jun 2021 3:22 PM GMT
రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం శుభ‌వార్త

ఏపీలోని రాజధాని ప్రాంత‌ రైతులకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల‌కు రావాల్సిన‌ రూ.195 కోట్ల వార్షిక కౌలు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుధవారం జీఓను విడుదల చేశారు. ఈ నిధులు ఒకటి రెండు రోజుల్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. వాస్తవంగా ఏప్రిల్‌ నెలలో రైతులకు కౌలు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది ఇంకా చెల్లించకపోవడంతో రైతులు నిరసన తెలుపుతున్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినా ఇంతవరకూ చెల్లింపులు చేయలేదని రైతులు ప్ర‌భుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం బుధవారం నిధులు విడుదల చేస్తున్నట్లు ప్ర‌క‌టించింది.


Next Story
Share it