నేడు రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక
Amit Shah on 3 day visit to Andhra Pradesh starting today.మూడు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి అమిత్ షా
By తోట వంశీ కుమార్ Published on 13 Nov 2021 10:08 AM ISTమూడు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు(శనివారం) ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఢిల్లీ నుంచి సాయంత్రం రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి తాజ్ హోటల్‌కు వెళ్లనున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఆదివారం ఉదయం భారత వైమానిక దళ హెలికాప్టర్ లో నెల్లూరు జిల్లా వెంకటాచలానికి చేరుకుంటారు. అక్కడ స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవంలోనూ, ముప్పవరపు ఫౌండేషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. సోమ నైపుణ్యాభివృద్ది కేంద్రం, గ్రామీణ స్వయం సాధికార శిక్షణ సంస్థను సందర్శిస్తారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతిలోని తాజ్ హోటల్‌కు చేరుకుటారు. అదే హోటల్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. ఆ భేటి ముగిసిన అనంతరం రాత్రి తాజ్ హోటల్‌లోనే బసచేయనున్నారు. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నాం ఢిల్లీ బయలుదేరి వెలుతారు.
నేడు తిరుపతి సీఎం
సీఎం జగన్ శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. తిరుపతి తాజ్ హోటల్‌లో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న అమిత్‌షాకు స్వాగతం పలికి అక్కడి నుంచి తిరుమల వెళతారు. రాత్రి 9.30 గంటల అనంతరం వారిద్దరూ శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం సీఎం జగన్ రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు.