రాహుల్ ఆ బాధ్య‌త తీసుకుంటార‌ని విశ్వ‌సిస్తున్నా..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Aug 2020 3:48 AM GMT
రాహుల్ ఆ బాధ్య‌త తీసుకుంటార‌ని విశ్వ‌సిస్తున్నా..

కాంగ్రెస్ పార్టీలో జ‌రుగుతున్న ప్ర‌స్తుత ప‌రిణామాల‌పై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్, ఫైర్‌బ్రాండ్‌ విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిన్న దాదాపు 7 గంటలపాటు జ‌రిగిన సీడబ్ల్యూసీ స‌మావేశం.. మరో ఆరు నెలల పాటు సోనియా గాంధీయే అధ్యక్షురాలిగా కొనసాగుతారని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుత ప‌రిణామాల‌పై విజ‌య‌శాంతి స్పందించారు.ఈ మేర‌కు విజయశాంతి.. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం చేసిన సేవలు చిరస్మరణీయం. అయితే ప్రస్తుతం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు త్వరలోనే ఒక కొలిక్కి వచ్చి పరిష్కారమవుతాయని.. పటిష్ట నాయకత్వంతో పార్టీ ముందడుగు వేస్తుందని ఆ బాధ్యత శ్రీ రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని విశ్వసిస్తున్నాన‌ని ట్వీట్ చేశారు.

Next Story