నల్ల ధనం మీద విచారణ వద్దని నల్ల చొక్కా వేసుకున్నావా?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2020 6:33 AM GMT
నల్ల ధనం మీద విచారణ వద్దని నల్ల చొక్కా వేసుకున్నావా?

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలు ప్రారంభం సందర్భంగా.. టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అక్రమ అరెస్టులు నిరసిస్తూ టీడీపీ నాయకులు నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు నారా లోకేష్‌ నేతృత్వంలో పాదయాత్రగా వెళ్లారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చి విధ్వంస పాలన సాగిస్తున్నారని నినాదాలు చేశారు. ఈ పాద యాత్ర అసెంబ్లీ సమీపంలోని అగ్నిమాపక కేంద్రం నుంచి సభా ప్రాంగణం వరకు సాగింది.

ఇదిలా ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నల్లచొక్కా వేసుకున్న ఫోటోను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 'నల్ల ధనం మీద విచారణ వద్దని నల్ల చొక్కా వేసుకున్నావా? నాయుడూ వాటే కలర్‌సెన్స్!' అంటూ ఎద్దేవా చేశారు. కాగా ప్రభుత్వ తీరుకి నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు నల్లచొక్కాలు వేసుకుని ఈ రోజు పలు ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు.Next Story
Share it