రేపటి నుండి పెరగనున్న విజయ పాల ధరలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on
15 Dec 2019 2:11 PM GMT

తెలంగాణ రాస్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ ద్వారా సరఫరా చేస్తున్న 'విజయ తెలంగాణ' పాల ధర సోమవారం నుంచి పెరుగనున్నది. ఈ మేరకు లీటర్ పాలపై రూ.2 పెంచినట్లు టీఎస్‌డీడీసీఎఫ్ లిమిటెడ్ మేనేజ్‌మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. పెరిగిన ధర సోమవారం నుంచి అమల్లోకి రానున్నదన్నారు. ప్రస్తుతం టోన్డ్ మిల్క్ లీటర్ ధర రూ.42 కాగా, పెరిగిన ధరతో అది రూ. 44కు చేరుకోనున్నది. అయితే.. స్టాండెడ్ మిల్క్ మరియు హోల్ మిల్క్ ధరలలో ఎటువంటి మార్పు లేదని ప్రకటనలో పేర్కొంది.

Next Story