Fact Check : ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్ మీద రాళ్లతో దాడి చేశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2020 6:56 AM GMT
Fact Check : ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్ మీద రాళ్లతో దాడి చేశారా..?

బీహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొందరి మధ్య పొత్తులు కుదరగా.. మరికొన్ని పార్టీలు ఇంకా మంతనాలకు ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. ప్రచారాల్లో పలువురి మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్ మీద ప్రజలు రాళ్లు, ఇటుకలతో దాడి చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ప్రజల ఆగ్రహాన్ని చూసి నితీష్ కుమార్ పారిపోయాడు అంటూ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు.

'नीतिश कुमार जी आप इतना अच्छा काम करते ही क्यों हो

की जनता के बीच से आप को भागना पड़ रहा है' అంటూ వీడియోను పోస్టు చేశారు. నితీష్ కుమార్ ఎంతో గొప్ప పనులు చేస్తూ ఉన్నారు. అందుకే ప్రజలు ఇలా అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారు.. వాటిని తట్టుకోలేక ఆయన పారిపోయారు అంటూ పోస్టులు పెడుతూ వస్తున్నారు.

ట్విట్టర్ లోనూ, ఫేస్ బుక్ లోనూ ఈ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.

నిజ నిర్ధారణ:

ఈ ఘటనకు సంబంధించి న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ANI News, India TV లో ఈ ఘటనకు సంబంధించిన కథనాలు కనిపించాయి. అయితే ఈ ఘటన ఇప్పుడు చోటు చేసుకున్నది కాదు. 2018 సంవత్సరం బుక్సార్ లో చోటు చేసుకున్నది. జనవరి నెలలో నితీష్ కుమార్ 'వికాస్ సమీక్ష యాత్ర' లో భాగంగా బుక్సార్ లో పర్యటించినప్పుడు ప్రజలు ఆయన కాన్వాయ్ మీద దాడి చేశారు.

జనవరి 2018న టైమ్స్ ఆఫ్ ఇండియా లో కూడా ఈ ఘటనకు సంబంధించిన కథనాలను ప్రచురించారు. ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి.

Outlook India లో జనవరి 2018న కథనాన్ని ప్రచురించారు. “Bihar Chief Minister Nitish Kumar’s cavalcade was today pelted with stones while he was on his way to a village as part of the state-wide Vikas Samiksha Yatra.” అంటూ రాసుకొచ్చారు. నితీష్ కుమార్ 'వికాస్ సమీక్ష యాత్ర' లో భాగంగా వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని మీడియాలో చెప్పుకొచ్చారు.

జూన్ 2020లో కూడా ఇదే వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా కాన్వాయ్ మీద దాడి చేశారని అందులో చెప్పుకొచ్చారు. ఈ వార్తలు కూడా అబద్ధం అని తేల్చడం జరిగింది.

ఈ వీడియోలో ఉన్నది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్ అన్నది నిజమే.. ఈ ఘటన 2018 సంవత్సరంలో చోటు చేసుకుంది. ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలో చోటు చేసుకుందన్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

Claim Review:Fact Check : ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్ మీద రాళ్లతో దాడి చేశారా..?
Claim Reviewed By:Misha Rajani
Claim Fact Check:false
Next Story