Fact Check : భారత్ లో చైనా చర్యలను అడ్డుకోడానికి భారతీయులు వందల సంఖ్యలో దూసుకొచ్చారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Jun 2020 10:07 AM IST
Fact Check : భారత్ లో చైనా చర్యలను అడ్డుకోడానికి భారతీయులు వందల సంఖ్యలో దూసుకొచ్చారా..?

ఓ కొండ మీద నుండి కొన్ని వందల మంది కిందకు దిగుతూ ఉన్న వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భారత సరిహద్దుల్లో చైనా ప్రభుత్వం చేపట్టిన పనులను ఆపడానికి పెద్ద ఎత్తున భారతీయులు దూసుకుని వచ్చారు అని చెబుతూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.

‘No. This is not a new Brad Pitt zombie movie. These are hundreds of Indians running to block #China’s illegal constructions in the border with #India. Latest Beijing move might just explode in #XiJinping’s face.’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇది బ్రాడ్ పిట్ హీరోగా నటిస్తున్న జాంబీ సినిమా కాదు. భారత సరిహద్దుల్లో చైనా చేపట్టిన అక్రమ నిర్మాణాలను అడ్డుకోడానికి భారతీయులే కదలివచ్చారు అని అందులో ఉంది.



‘Flash flood? No, it was the angry Indian people who rushed to the border between #India and #CCP! Prevent the CCP from unauthorized construction. Brave Indians! ! #MilkTeaAlliance #CCP_is_terrorist’



కోపోద్రిక్తులైన భారతీయులు చైనా చేపట్టిన అక్రమ నిర్మాణాలను అడ్డుకోడానికి దూసుకువస్తున్నారు. అంటూ మరికొందరు సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.

కొరియాకు చెందిన insight.co.kr వెబ్ సైట్, భారత దళాలు గల్వాన్ లోయలో చైనా సైన్యం మీదకు దూసుకు వస్తున్నారని... చైనా-భారత్ సరిహద్దుల్లో గత కొద్దిరోజులుగా ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయని. చైనా చేపట్టిన అక్రమ నిర్మాణాలను అడ్డుకోడానికి అలా దూసుకువచ్చారని కథనాలను ప్రచురించారు.

ఈ వీడియోను మిగిలిన మాధ్యమాల్లో కూడా షేర్ చేశారు.

https://gezip.net/bbs/board.php?bo_table=humor2&wr_id=3878299

‘Xiaofeng Media Goes Global’ అనే యుట్యూబ్ ఛానల్ లో కూడా చైనా చేపట్టిన పనులను అడ్డుకోడానికి భారతీయులు ఒక్కటిగా దూసుకు వచ్చారు అని చెబుతూ వీడియోను అప్లోడ్ చేశారు.

నిజ నిర్ధారణ:

చైనా మీదకు భారతీయలు దూసుకొచ్చారు అన్న ఈ వీడియో 'పచ్చి అబద్ధం'

మీడియాలో కూడా దీనిపై ఎటువంటి వార్తలు రాలేదు.

AFP Fact Check ప్రకారం ఈ వీడియోను డీబంక్ చేయగా.. ఈ వీడియో మయన్మార్ లోని జేడ్ మైనింగ్ కు సంబంధించినది. ‘Jade mining in Myanmar’ అనే కీవర్డ్స్ ను ఉపయోగించగా ఈ మైనింగ్ కు సంబంధించిన పలు వీడియోలు బయటకు వచ్చాయి.

2019 లో బిబిసి పబ్లిష్ చేసిన ఒక వీడియోలో మయన్మార్ కు చెందిన జేడ్ మైన్స్ లోకి ప్రజలు ఎంతో ఆశగా దూసుకుని వచ్చారు. విలువైన రాళ్లు దొరుకుతాయనే ఆశతో వారు ఇలా మైన్స్ లోకి వచ్చారని.. ఇలాంటి ఘటనలు అక్కడ సాధారణంగా జరుగుతున్నవే అని తెలిపారు.



ఇలాంటి మరిన్ని వీడియోలు కూడా చూడొచ్చు.. ప్రజలు మైన్స్ లోకి పరిగెత్తుకుంటూ రావడం, బైక్స్ తో రావడం జరుగుతూనే ఉన్నాయి.

Global Witness about Jade అని ప్రచురించిన ఆర్టికల్ లో ఇలాంటి విజువల్స్ ఉన్న వీడియో చూడొచ్చు.

altnews.in ఈ వీడియోను డీబంక్ చేసింది.

చైనా చేపట్టిన పనులకు వ్యతిరేకంగా భారతీయులు దూసుకు వచ్చారు అంటూ వైరల్ అవుతున్న వార్తలో ఎటువంటి నిజం లేదు. ఇది మయన్మార్ లోని జేడ్ మైనింగ్ ప్రాంతం.

Claim Review:Fact Check : భారత్ లో చైనా చర్యలను అడ్డుకోడానికి భారతీయులు వందల సంఖ్యలో దూసుకొచ్చారా..?
Claim Fact Check:false
Next Story