Fact Check : అజర్ బైజాన్-అర్మేనియా దేశాల మధ్య యుద్ధాన్ని ఇరాన్ ప్రజలు వీక్షిస్తూ ఉన్నారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Oct 2020 2:41 PM GMT
Fact Check : అజర్ బైజాన్-అర్మేనియా దేశాల మధ్య యుద్ధాన్ని ఇరాన్ ప్రజలు వీక్షిస్తూ ఉన్నారా..?

అజర్ బైజాన్-అర్మేనియా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఈ యుద్ధానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ఇరుదేశాల మధ్య యుద్ధవాతావరణం కమ్ముకుందని.. ఇది ఎటు దారితీస్తుందో తెలియడం లేదని చెబుతూ ఉన్నారు.

ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఒకవైపు నుండి మరో వైపునకు పెద్ద ఎత్తున రాకెట్లు వెళ్లడం.. ఆ తర్వాత అటువైపు నుండి ఇటువైపునకు రాకెట్లు రావడం గమనించవచ్చు. అజర్ బైజాన్-అర్మేనియా దేశాల మధ్య చోటు చేసుకుంటున్న యుద్ధానికి సంబంధించిన వీడియో అని.. ఇరాన్ ప్రజలు ఏ మాత్రం భయపడకుండా ఈ యుద్ధాన్ని వీక్షిస్తూ ఉన్నారని వీడియోలో చెప్పుకొచ్చారు.

“Iranians stood on the top of the mountain and watched the war between Azerbaijan and Armenia launching rockets at each other as if watching some cracker show. Both countries have borders with Iran.” అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇరాన్ దేశ ప్రజలు ఓ కొండా మీదకు ఎక్కి అజర్ బైజాన్-అర్మేనియా దేశాల మధ్య చోటు చేసుకుంటున్న యుద్ధాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఇరు దేశాలు రాకెట్ లను లాంఛ్ చేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఉన్నారని ట్వీట్లలో తెలిపారు. ఆ వీడియోలో గుంపులు గుంపులుగా ఉన్న జనాలు.. గాల్లో రాకెట్లు వెళుతూ ఉంటే చూస్తూ ఉండి పోయారు. వీడియోలు తీసుకుంటూ కనిపించారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

ఈ వీడియోకు సంబంధించి న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ‘BM-21 GRAD (БМ-21 “Град”) – Rapid Fire’ అనే టైటిల్ లో నవంబర్ 27, 2019 న ఈ వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. దీన్ని బట్టి ఈ వైరల్ అవుతున్న వీడియో అజర్ బైజాన్-అర్మేనియా దేశాల మధ్య ఇప్పుడు చోటు చేసుకుంటున్న యుద్ధానికి సంబంధించిన వీడియో కాదని స్పష్టమవుతోంది.

రష్యా దేశానికి చెందిన మీడియా ఛానల్ NTV కూడా అప్పట్లో వీడియోను పోస్టు చేసింది. రష్యా చేస్తున్న సైనిక విన్యాసాలకు సంబంధించిన వీడియో ఇదని స్పష్టం చేసింది. వివిధ రాకెట్ లాంఛ్ సిస్టమ్స్ ను రష్యా పరీక్షిస్తూ ఉన్నప్పుడు తీసిన వీడియో ఇదని వెల్లడించింది.



చైనీస్ వెబ్సైట్ అయిన QQ లో ఈ ఘటనకు సంబంధించిన కథనాన్ని పోస్టు చేశారు. రష్యా సైనిక విన్యాసాలతో భాగంగా చోటు చేసుకున్న ఘటన ఇదని వెల్లడించారు. సైనిక విన్యాసాలలో భాగంగా రష్యా చాలా మిసైల్స్ ను, ఆయుధాలను పరిశీలించిందని స్పష్టం చేశారు. అవి చూడడానికే ప్రజలంతా ఇలా ఓ ఎత్తైన ప్రాంతానికి వచ్చారని స్పష్టం చేశారు. రష్యాకు చెందిన రాకెట్ ఫోర్సెస్, ఆర్టిల్లరీ డే ను ప్రతి ఏడాది నవంబర్ 19న జరుపుకుంటూ ఉంటారు. ఆరోజున ఇలాంటి సైనిక విన్యాసాలు ఉంటాయి.

వైరల్ అవుతున్న వీడియోకు అజర్ బైజాన్-అర్మేనియా దేశాల మధ్య యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో రష్యాకు సంబంధించినది. 2019లో సైనిక విన్యాసాలలో భాగంగా తీసిన వీడియో ఇది. వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

Claim Review:Fact Check : అజర్ బైజాన్-అర్మేనియా దేశాల మధ్య యుద్ధాన్ని ఇరాన్ ప్రజలు వీక్షిస్తూ ఉన్నారా..?
Claim Reviewed By:Misha Rajani
Claim Fact Check:false
Next Story