లాక్‌డౌన్‌: మద్యం షాపులపై వర్మ ట్వీట్‌

By సుభాష్  Published on  26 April 2020 1:26 PM GMT
లాక్‌డౌన్‌: మద్యం షాపులపై వర్మ ట్వీట్‌

దేశ వ్యాప్తంగా కరోనా వల్ల లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో అన్ని షాపులతో పాటు మద్యం షాపులు సైతం మూతపడ్డాయి. ఇక వివాదాల దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మరో ట్వీట్‌ చేశాడు. ఎందుకంటే వర్మ అంటేనే ఒక సంచలనం. ఎప్పుడు ఎలాంటి ట్వీట్‌ చేస్తాడో.. ఎలాంటి కామెంట్లు చేస్తాడో చెప్పలేని పరిస్థితి. ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉంటాడు. లాక్‌డౌన్‌ కారణంగా మద్యం షాపులు మూసివేయడంతో మందుబాబులు విలవిలలాడుతున్నాయి. మద్యం దొరక్క కంటినిండా నిద్ర లేకుండా అయిపోతోంది. మద్యం లేక కొందరు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ ఎర్రగడ్డ మెంట్‌ ఆస్పత్రిలో క్యూలు కడుతున్నారు.

ఇతర రాష్ట్రాల్లో మద్యం ప్రియుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఏదో ఒక విధంగా మద్యం అమ్మే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులు మూతపడటంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. మద్యం షాపులు తెరవండి సార్‌.. అంటూ మద్యం బాబులు వేడుకుంటున్నారు.

ఇక తాజాగా దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ..మద్యం అందుబాటులో లేకపోతే బ్లాక్‌ మార్కెట్‌ ద్వారా జరిగే అనర్థాలపై ట్వీట్‌ చేశాడు. ప్రజలు కోరుకునే వాటిని అందేలా పరిమితం చేస్తే ఇతర వాళ్లు బ్లాక్‌ మార్కెట్‌ దందాలు చేసే వీలు ఉండదు. మద్యాన్ని బ్లాక్‌లలో విక్రయించడం ద్వారా ప్రజలు వారికి అవసరమైన మద్యాన్ని ఎక్కువ ధరలకు కొనుగోలు చేసి నష్టపోవాల్సి వస్తోంది. దీంతో కుటుంబ అవసరాలను సైతం ప్రజలు కోల్పోవాల్సి వస్తుంది.. అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వర్మ.

మరో వైపు వర్మ 2019లో ప్రజలు రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. వర్మ చేసిన ఈ రెండు ట్వీట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.





Next Story