జబర్దస్త్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌కు చెప్పరానంత కోపం వచ్చింది. ఓ వ్యక్తిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆ వ్యక్తిని కుక్కను కొట్టినట్లు కొట్టాలంటూ ఆగ్రహంతో ఊగిపోయింది. సహజంగా రష్మీకి మూగజీవాలంటే ఎంతో ప్రేమ. కుక్కలను సైతం ఎంతో అప్యాయంగా చూసుకుంటుంది. మూగ జీవాలపై ఎవరైనా ఏమైన అంటే రష్మీ వెంటనే రియాక్ట్‌ అవుతుంది. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ముంబాయిలో ఓ వ్యక్తి ఫోన్‌ మాట్లాడుకుంటూ వెళ్తూ ఓ కుక్కను కాలితో తన్నాడు. దీంతో ఆ కుక్క చనిపోయింది.

ఈ ఘటనపై కశ్మీరా పోలీసుస్టేషన్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే ఆ వ్యక్తి కుక్కను తన్నిన దృశ్యం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియోను కొదంరు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన రష్మీకి తెగ కోపం వచ్చింది. కుక్క దాని దారిలో అది పోతుంటే ఆయనకేమైంది. ఆ కుక్కును కొట్టినట్లే అతనిని కూడా కొట్టాలి. కర్మ వారిని ఏం వదిలిపెట్టదు అని ట్వీట్‌ చేసింది రష్మీ. అంతేకాదు కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీని ట్యాగ్‌ చేసి కేవలం మూగ జీవాలను రక్షిస్తే సరిపోదు, ఇలాంటి చర్యలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు చట్టాలు తీసుకురావాలి అని అన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.