షాకింగ్ న్యూస్ : అక్క‌డ‌ ఒక్క క‌రోనా కేసు లేద‌ట‌.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 April 2020 12:29 PM GMT
షాకింగ్ న్యూస్ : అక్క‌డ‌ ఒక్క క‌రోనా కేసు లేద‌ట‌.!

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న‌ మహమ్మారి కరోనా పుట్టిల్లు చైనాలోని వుహాన్‌లో ఒక్క క‌రోనా కేసు కూడా లేదంటూ అక్క‌డి ఆరోగ్యశాఖ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. పేషంట్లందరూ కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. కొద్ది రోజులుగా కొత్తగా కేసులు నమోదు కాకపోవడంతో క‌రోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య జీరోకు చేరుకుందని అక్క‌డి ఆరోగ్య శాఖ తెలుపుతుంది.

నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ అధికార ప్రతినిధి మి ఫెంగ్ మాట్లాడుతూ.. వుహాన్‌ నగరంలోని కోవిడ్‌ బాధితులందరూ కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఈ రోజు వరకు ఒక్క కొత్త కేసూ నమోదు కాలేదు. వుహాన్‌ నగర పాలక సంస్థ, దేశంలోని వైద్య సిబ్బంది కృషి వల్లే ఇది సాధ్యమైంది. ఇందుకు అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లని అన్నారు. ఇక వైర‌స్ పుట్టిల్లు‌ వుహాన్‌లో 46,452 మంది క‌రోనా బారినపడగా.. 3869 మంది మృతి చెందారు. అలాంటిది అక్క‌డ ఒక్క కేసు కూడా న‌మోదు అవ‌క‌పోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌క‌రం.

ఇదిలావుంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కూ 29 లక్షల మంది కరోనా‌ బారిన పడ్డారు. రెండు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే దీని బారి నుండి 8 లక్షల 40 వేల మంది కోలుకున్నారు. ఇక 54వేల‌ మ‌ర‌ణాల‌లో అమెరికా మొద‌టి స్థానంలో ఉండగా, 26 వేల మరణాలతో ఇటలీ, 22 వేల మరణాలతో స్పెయిన్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Next Story