వెంకీమామ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత..?
By Newsmeter.Network Published on 14 Dec 2019 4:16 PM ISTవిక్టరీ వెంకటేష్, యువ సమ్రాట్ నాగ చైతన్యల క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన భారీ మల్టీస్టారర్ వెంకీమామ. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా వెంకటేష్ పుట్టినరోజు కానుకగా ఈ నెల 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుని సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది.
ఇక ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే... నైజాం - 2.29 కోట్లు, సీడెడ్ - 1.60 కోట్లు, ఉత్తరాంధ్ర - 0.87 లక్షలు, ఈస్ట్ - 0.60 లక్షలు, వెస్ట్ - 0.30 లక్షలు, కృష్ణ - 0.37 లక్షలు, గుంటూరు - 0.72 లక్షలు, నెల్లూరు - 0.27 లక్షలు మొత్తం ఏపి & తెలంగాణలో మొదటి రోజు షేర్ 7.02 కోట్లు. ఓవర్ సీస్ లో కలెక్షన్స్ తో కలిపి దాదాపు 10 కోట్లు షేర్ ఉంటుందని అంచనా.
అయితే... ఫస్ట్ డే టోటల్ గ్రాస్ 16.5 కోట్లు కలెక్ట్ చేసినట్టు సురేష్ ప్రొడక్షన్స్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేసింది. రెండో రోజు కూడా ఇదే స్పీడుతో కలెక్షన్స్ ఉండడం విశేషం. వెంకటేష్, నాగ చైతన్య ఈ ఇద్దరి కెరీర్ లో ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఇదే హయ్యస్ట్. ఎ.బి, సి అని తేడా లేకుండా ఆల్ సెంటర్స్ లో రికార్డు స్ధాయి కలెక్షన్స్ వసూలు చేసే దిశగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. మరి.. ఫుల్ రన్ లో వెంకీమామ ఎంత కలెక్ట్ చేస్తాడో చూడాలి.