ముఖ్యాంశాలు

  • కరోనా వైరస్ ఎఫెక్ట్
  • ప్రపంచ ఆర్థికమాంద్యాన్ని దెబ్బతీసిన కరోనా
  • గిట్టుబాటు ధరలు వస్తుండటంతో రైతన్నల హర్షం

ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక మాంద్యంపై దెబ్బకొట్టింది. కరోనా పుణ్యమా అని..స్టాక్ మార్కెట్లు గతంలో ఎన్నడూ లేనంత నష్టాల్ని చవిచూశాయి. మదుపరుల పెట్టుబడులు నీరులా ఆవిరైపోతుంటే చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. స్టాక్ మార్కెట్ల కుంగుబాటుతో..డాలర్ కు రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమైంది. అలాగే ప్రపంచ దేశాల్లోని సాఫ్ట్ వేర్, ఇతర కంపెనీలలో కొన్ని తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే..మరికొన్ని కంపెనీలు రెండువారాలపాటు సెలవులిచ్చాయి. ఇంకొన్ని కంపెనీలైతే ఏకంగా ఉద్యోగులనే తొలగించేశాయి. ఫలితంగా చాలామంది నిరుద్యోగులయ్యారు.

Also Read : ‘కామసూత్ర’ భామకు కరోనా వైరస్‌

స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, మాల్స్, పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు ఇలా ఒక్కటేమిటి..అన్నీ మూతపడ్డాయి. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువయ్యే కొద్దీ ప్రపంచ ఆర్థికాదాయం తగ్గుతోంది. ఒకదేశంతో మరొక దేశానికున్న సత్సంబంధాలు తెగిపోయాయి. ఏ దేశానికి ఆదేశం దేశ సరిహద్దులను మూసివేశాయి. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. భారత్ కూడా అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసింది. కేవలం ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు తిరిగి స్వదేశానికి వచ్చేందుకై ప్రత్యేక ఏర్పాట్లు చేసే యోచనలో ఉంది భారత ప్రభుత్వం. అంతర్జాతీయ సరిహద్దుల మూసివేతతో ఇతర దేశాల నుంచి వచ్చే దుస్తులు, ఉల్లిపాయలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా రకరకాల దిగుమతులు నిలిచిపోయాయి.

Also Read : నిర్భయ దోషులను ఉరి తీసినందుకు తలారికి ఎంత ఇస్తారంటే..

ఏదేమైనా కరోనా వైరస్ వల్ల ఇప్పుడు లాభపడేదల్లా రైతన్న మాత్రమే. కరోనా ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూరగాయల మార్కెట్లు సైతం మూతపడుతాయన్న ఊహాగానాలు వ్యక్తమవుతుండటంతో వాటికి గిరాకీ ఏర్పడింది. ఉన్నట్లుండి కూరగాయలు, పప్పు ధాన్యాలు, ఇతర నిత్యావసర ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పటి నుంచి రైతు మార్కెట్లకు జనం ఎగబడుతున్నారు. నిన్న మొన్నటి వరకు రెండు కిలోల ఉల్లి రూ.50 పలుకగా..ఇప్పుడు రూ.70-రూ.80కి రెండు కిలోలు అమ్ముతున్నారు వ్యాపారస్తులు. మిగతా కూరగాయల ధరలైతే చెప్పనక్కర్లేదు. ఉదాహరణకు కరోనా రాకముందు రైతుల వద్ద కిలో టమోటా రూ.5కి కొంటే..దళారులు వాటిని వినియోగదారులకు రూ.20కి అమ్ముకున్నారు. ఇప్పుడు కిలో టమోటా రూ.40కి అమ్మినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Black Mung Bean

పంట చేతికొచ్చే సమయంలో..

ఇప్పుడు మినుము పంట చేతికొచ్చే సమయం. ఈ సమయంలో మినుముల రైతులు పంటను అమ్మితే మాత్రం గిట్టుబాటు ధర కన్నా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రెండ్రోజుల క్రితం వరకూ క్వింటా మినుముల ధర రూ.7000 పలికింది. మరో నాలుగు రోజులాగితే ఈ ధర 3000 పెరిగి క్వింటా మినుముల ధర రూ.10,000 పలికినా ఆశ్చర్యం లేదు. దీని వల్ల రైతులకు లాభంతో పాటుగా..దళారులు తమ వద్దనున్న పాత సరుకుని కూడా ఈ ధరకే అమ్మి లాభాలు పొందుతారు. రైతులకు గిట్టుబాటు వస్తుంది కానీ..అన్నీ మూతపడి ఆర్థికాదాయం లేకుండా సాటి మధ్యతరగతి కుటుంబం పెరిగిన రేట్లతో కుటుంబ పోషణను నెట్టుకొస్తుందా ? అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. ఏదేమైనా కరోనా వైరస్ భారత్ లో కూడా విజృంభిస్తుండటంతో ప్రజలంతో భయంతో బిక్కు బిక్కుమంటున్నారు.

Also Read : నిర్భయ దోషుల మృతదేహాలకు కాసేపట్లో పోస్ట్‌ మార్టం

తుమ్మినా, దగ్గినా ఆ వ్యక్తిని కరోనా బాధితుడిగానే చూస్తున్నారు. ఈ క్షణానికి దేశవ్యాప్తంగా 195కరోనా కేసులుండగా..5 గురు బాధితులు మృతి చెందారు. ఆంధ్రాలో మరో కరోనా కేసు నమోదైంది. ముగ్గురు కరోనా బాధితులకు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో కూడా పరిస్థితి చాలా దారుణంగానే ఉంది. ముఖ్యంగా కరీంనగర్ లోని రామగుండంకు వచ్చిన ఇండోనేషియన్లకు కరోనా ఉందని తేలడంతో ఆ ప్రాంత వాసులంతా ఆందోళనకు గురవుతున్నారు. కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా మార్చి 22వ తేదీ ఆదివారం..యావత్ దేశమంతా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎందుకంటే కరోనా వైరస్ జీవితకాలం ఏ ప్రాంతంలోనైనా 12 గంటలు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ..అంటే 14 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిస్తే ఎవరికీ కరోనా రాకుండా ఉంటుందన్న ఆలోచనతో ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.