కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు కరోనా వల్ల 8వేలకు పైగా మృతి చెందగా, 2 లక్షలకుపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్‌ పిల్లల నుంచి వృద్దుల వరకు వదలడం లేదు. ఇక ఈ వైరస్‌ సెలబ్రిటీలు సైతం వదలడం లేదు. తాజాగా ‘కామా సూత్ర’ హీరోయిన్‌కు కూడా సోకింది.  కామసూత్ర, గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ హీరోయిన్‌, భారత సంతతికి చెందిన ఇందిరా వర్మ కరోనా వైరస్‌ బారిన పడింది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా,  కరోనా పాజిటివ్‌ తేలింది. కాగా, సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని ఇందిరా తన అభిమానులకు తెలిపింది. కరోనా సోకడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలిపింది. ఈ కారణంగా వచ్చిన షోలను రద్దు చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందు వస్తానని చెబుతోంది.

కాగా, కరోనా వైరస్‌ దాదాపు 200 దేశాలకు పాకింది. ఇది వరకు కరోనా మరణాల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా, ఇటలీ రెండో స్థానంలో ఉంది. ఇక తాజాగా కరోనా మరణాల్లో ఇటలీ చైనాను దాటేసింది. ఇక భారత్‌లో కరోనా మరణాల సంఖ్య నాలుగుకు చేరుకోగా, 198 పాటిజివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల్లోనే మొత్తం 54 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా 59 కేసులు మహారాష్ట్రలో నమోదు కాగా, ఏపీలో మూడు కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో ఆ సంఖ్య 16కు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ సహ 14 రాష్ట్రాల్లో గురువారం కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.