నటుడు కొడుకుతో బిగ్‌బాస్‌ బ్యూటీ రాసలీలలు..!

సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్‌ అనేవి సర్వసాధారణమైపోయాయి. ఎవరితో ఎవరు ఎలాంటి ఎఫైర్స్‌ కొనసాగిస్తున్నారో తెలియని పరిస్థితి. గత సంవత్సరం ఓ హీరోతో ప్రేమలో ఉన్న హీరోయిన్‌.. ఆయనకు పెళ్లి కాగానే మరో హీరోతో ప్రేమలో దించినట్లు తెలుస్తోంది. అంతా ట్రెండ్ ఫాలో అవుతున్న ఈ ముద్దుగుమ్మ పేరే యషికా ఆనంద్‌. ఈ బ్యూటీ తెలుగులో పెద్దగా పరిచయం లేకపోయినా తమిళంలో మాత్రం బాగా పాపులర్‌. ముఖ్యంగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఆ అమ్మడికి ఫాలోయింగ్‌ మరింత పెరిగిపోతోంది.

దానికి తోడు హట్‌ హట్‌ ఫోటోలు, షోలు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. నాలుగేళ్ల కిందట కేవలం 16 ఏళ్ల వయసులోనే తమిళ ఇండస్ట్రీలో వచ్చిన ఈ యషికా ఆనంద్‌ బ్యూటీ, 2018లో బిగ్‌బాస్‌ సీజన్‌ 2తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అది జరుగుతున్న సమయంలోనే మీటూ క్యాంపెయిన్‌లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఓ దర్శకుడిపై ఆరోపణలు చేసి మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు నటుడు మహత్‌ రాఘవేంద్ర ను ప్రేమిస్తున్నట్లు చెప్పి సంచలనం సృష్టించింది. కానీ ఆయన బయటకు వచ్చిన తర్వాత మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

దాంతో ఇప్పుడు యషికా ఓ నిర్మాత కొడుకుతో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. తమిళ నిర్మాత, జాతీయ అవార్డు గ్రహీత తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో యషికా ఆనంద కొన్నాళ్లుగా ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య రాసలీలలు కూడా కొనసాగాయని తమిళ వర్గాల్లో పుకార్లు షికార్లు అవుతున్నాయి. మణియార్‌ కుటుంబం సినిమాతో కలిసి నటించిన ఈ ఇద్దరు ఆ తర్వాత ఫెండ్స్‌ గా మారి ఇప్పుడు ప్రేమికులయ్యారట. పైగా ఈ ఇద్దరి ముద్దు వీడియో కూడా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ఎన్నో వార్తలు వచ్చినా ఇప్పటి వరకు ఖండిచకపోవడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. వీరిద్దరి మధ్య వస్తున్న పుకార్లు ఎంత వరకు నిజమో తెలియాలి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *