జబర్దస్త్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ బ్యూటీ.. కరోనా వైరస్‌పై చాలా ఎక్కువగా స్పందిస్తోంది. నిన్న కరోనాకు సంబంధించి విమానాశ్రయంలో చేపడుతున్న చర్యలపై రష్మీ ప్రశ్నించింది. తాజాగా కరోనాపై అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ట్వీట్‌ చేసింది. మనకు మనమే ఐసోలేషన్‌లో ఉండాల్సిన పని లేదని, ప్రభుత్వాలు ఎమర్జెన్సీ ఏం ప్రకటించలేదని చెప్పుకొచ్చింది. అలాంటి సమయంలో సినిమా వాళ్లు షూటింగ్‌లు నిలిపివేయడం కూడా కరెక్ట్‌ కాదని రష్మీ మరో ట్విట్‌ చేసింది. చాలా మంది యాక్టర్స్‌  కాంట్రాక్టులు తీసుకుని ఉన్నారని, అలాంటప్పుడు ప్రొడక్షన్‌ హౌస్‌ షూటింగ్‌ చేయాలని కోరితే మనమంతా షూట్‌లో పాల్గొనాల్సి ఉంటుందని ట్వీట్‌లో చెప్పుకొచ్చింది జబర్దస్త్‌ బ్యూటీ

ఏపీ రాజకీయాలపై స్పందించిన రష్మీ

ఇక రష్మీ కరోనా గురించే కాదు.. ఏపీ రాజకీయాలపై కూడా స్పందించింది. మనకు మనం అన్ని పనులు మానేసుకుని ఆస్పత్రుల్లో చేరాల్సిన పని లేదంది. అలాగే కరోనా కారణంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఎన్నికలు వాయిదా వేయాల్సిన పరిస్థితి లేదంటూ రష్మీ చెప్పుకొచ్చింది. జనం పోగవుతారన్న కారణంతో ఎన్నికలు కూడా వాయిదా వేయాల్సిన అవసరం లేదని రష్మీ మరో ట్వీట్‌ చేసింది.

రష్మీ ట్వీట్లపై ఘాటుగా స్పందించిన నెటిజన్లు

కాగా, ఇన్ని ట్వీట్లు చేసుకుంటూ వస్తున్న రష్మీపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఓవరాక్షన్‌ చేయవద్దంటూ మసేజ్‌లు పెడుతున్నారు. ‘నీకే అన్నీ తెలుసు అనేలా మాట్లాడటం కరెక్ట్‌ కాదని, ఏపీ సీఎం, తెలంగాణ సీఎం చెప్పింది అర్థం కాకపోతే ముందుగా వెళ్లి తెలుగు నేర్చుకో అంటూ చురకలంటించారు నెటిజన్లు. ఇప్పటి వరకూ కరోనా వైరస్‌కు మెడిసిన్‌ లేదు. నివారణ ఒక్కటే మార్గం. పారాసిట్మల్‌ వేసుకుంటే కొంత వరకు మాత్రమే పని చేస్తుంది’ అంటూ రష్మీ గౌతమ్‌ ట్వీట్లకు రిప్లై ఇస్తున్నారు నెటిజన్లు.

ఇక మరి కొందరు ఏమన్నారంటే..

రష్మీ పోస్టులకు మరి కొందరు మరోలా ట్వీట్‌ చేస్తున్నారు. ‘నువ్వు ఏమైనా ఎంబీబీఎస్‌ సర్జన్‌వా? చీఫ్‌ మినిస్టర్స్‌ కంటే నీకు ఎక్కువ తెలుసా.? ముఖ్యమంత్రులు మాట్లాడే ముందు వైద్యులు, సెక్రటేరియట్లను సంప్రదించకుండా కామెంట్లు చేస్తారా..? వాళ్ల కంటే నీకు ఎక్కువ తెలుసా..?’ అంటూ బదులిస్తున్నారు. ఇంకా ఎందరో రష్మీ పోస్టులకు ఘాటుగా స్పందించారు. అయినా రష్మీ ఆగకుండా ట్వీట్లు చేస్తూనే ఉంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.