నిర్భయ దోషులను ఉరి తీసినందుకు తలారికి ఎంత ఇస్తారంటే..

By సుభాష్  Published on  20 March 2020 3:19 AM GMT
నిర్భయ దోషులను ఉరి తీసినందుకు తలారికి ఎంత ఇస్తారంటే..

ఎట్టకేలకు నిర్భయ దోషుల కథ ముగిసింది. 8 ఏళ్లుగా సాగుతున్న విచారణ నేటితో ముగిసింది. ఈ రోజు నలుగురు నిర్భయ దోషులకు తీహార్‌ జైల్లో తలారి పవన్‌ ఉరి తీశారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌కు చెందిన పవన్‌ జల్లాడ్‌ నిర్భయ దోషులకు ఉరివేసే అవకాశం దక్కింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులను ఉరి వేసేందుకు ప్రభుత్వం పవన్‌ జల్లాడ్‌ను ఎందుకు ఎంచుకుంది...? ఇంతకు ఆయన ఎవరు..?అలాగే ఉరిశిక్ష వేసిన తర్వాత ఆయన పారితోషకం ఎంత ఇస్తారనేది చాలా మందిలో తలెత్తే ప్రశ్న.

ఉరి తీసేందుకు పవన్‌ను ఎందుకు ఎంచుకున్నారు..

నిర్భయ దోషులను ఉరితీసేందుకు పవన్‌నే సరైన వ్యక్తిగా తీహార్‌ జైలు అధికారులు భావించారు. పవన్‌ ఇంతకు ముందు ఉరి తీసిన అనుభవం ఉంది. అంతేకాకుండా శారీరకంగా బలిష్టంగా ఉంటాడు పవన్‌. అతని పూర్వీకులు కూడా తలారీలు కావడం వల్ల ఎలాంటి తప్పిదాలు దొర్లవని అధికారులు భావించారు. అయితే ఇటీవల దోషులను ఉరి తీసేందుకు తలారి కావాలని అధికారులు ప్రకటించిన నేపథ్యంలో పవన్‌ దరఖాస్తు చేసుకోగా, అందుకు ఉత్తరప్రదేశ్‌ జైళ్ల శాఖ కూఆ అంగీకరించింది.

మరి ఉరి తీస్తే పారితోషకం ఎంతిస్తారు..?

ఇక దోషులను ఉరితీస్తే తలరిలకు పారితోషకం ఎంత ఇస్తారనేది చాలా మందిలో వచ్చే అనుమానం. ప్రస్తుత లెక్కల ప్రకారం.. ఒక దోషిని ఉరి తీస్తే రూ.25వేలు చెల్లిస్తుంది ప్రభుత్వం. అంటే నిర్భయ దోషులైన నలుగురికి ఉరి వేస్తే పవన్‌కు లక్ష రూపాయల పారితోషకం లభిస్తుంది. కాగా, ఆర్థిక పరిస్థితుల కారణంగా నిర్భయ దోషులను ఉరి తీసే అవకాశం రావాలని పవన్‌ జల్లాడ్‌ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. అనుకున్నట్లే ఆ అవకాశం పవన్‌కు దక్కింది. తలారిగా ఎంపికైన తర్వాత ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖకు కృతజ్ఞతలు తెలిపాడు.

Next Story