-5.30 గంటలకు దోషులను ఉరి తీసిన తిహార్ జైలు అధికారులు

నిర్భయ దోషుల కథ సుఖాంతమైంది. నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఎట్టకేలకు ఈ రోజు ఉదయం 5.30 గంటలకు తీహార్‌జైలు అధికారులు ఉరి తీశారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు నలుగురు దోషులు ఎన్నో నాటకాలు ఆడారు. వివిధ రకాల పిటిషన్ల కారణంగా మూడు సార్లు ఉరిశిక్ష వాయిదాపడుతూ వచ్చింది. ఇక ఇటీవల ఢిల్లీ పటియాల కోర్టు మార్చి 20 ఉరిశిక్ష ఖరారు చేసింది. ఉరిశిక్షకు ఒక రోజు ముందు అంటే గురువారం దోషులు శిక్ష నుంచి తప్పించుకునేందుకు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన పటియాల కోర్టు.. వారి పిటిషన్లను కొట్టివేసింది. దోషులకు ఉరిశిక్ష పడాల్సిందేనంటూ తీర్పునిచ్చింది. తర్వాత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ వేసిన పిటిషన్‌ను సైతం కోర్టు కొట్టివేసింది. ఇక ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితం నలుగురు దోషులను ఒకేసారి ఉరితీశారు. దోషులను ఉదయం 4 గంటలకు నిద్రలేపిన జైలు అధికారులు.. అల్పాహారం అందజేశారు. జైలు ముందు పెద్ద ఎత్తున జనాలు గుమిగూడారు.

అంతేకాదు.. దోషుల్లో ఎవరైన ఎవరైనా తమకు ఆరోగ్యం బాగాలేదని హై డ్రామా చేస్తే తప్ప ఉరి వాయిదా పడే అవకాశం లేదు. మరోవైపు నిన్న పటియాలా కోర్టు ఎదుట దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్‌ భార్య తన భర్తను విడిచిపెట్టాలంటూ మొరపెట్టుకుంది. చెప్పుతో కొట్టుకుంటూ లబోదిబోమని గగ్గోలు పెట్టింది. అక్కడున్న మహిళా న్యాయవాదులు ఆమెను సముదాయించారు. కొద్దిసేపటికే ఆ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. ఇప్పటి వరకూ నిందితుల ఉరిశిక్ష మూడు సార్లు వాయిదా పడింది.

కాగా, 2012, డిసెంబర్‌ 16న ఓ విద్యార్థిపై కదులుతున్నబస్సులు ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డుపై విసిరేసి పరారయ్యారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను సింగపూర్‌ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా, చివరకు కన్నుమూసింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెకు 'నిర్భయ'గా నామకరణం చేశారు.

ఈ ఘటనలో నిందితులైన, వినయ్‌, రామ్‌ సింగ్‌, అక్షయ్‌కుమార్‌, పవన్‌, ముఖేష్‌, మరో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని తీహార్‌ జైలుకు తరలించగా, 2013లో ఓ నిందితుడు జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో నిందితుడు మైనర్‌గా భావించి మూడు సంతవ్సరాల పాటు జైలు శిక్ష విధించి విడుదల చేశారు. కేసు విచారించిన కోర్టు, కాగా మిగిలిన నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది.

సుభాష్

.

Next Story