ముంబై: దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు వీరసావర్కర్‌కు భారత రత్న ఇస్తామని బీజేపీ తన మేనిఫెస్టో లో ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఈ ప్రకటన చేసింది. హిందూత్వ సిద్ధాంత రూపకర్త సావర్కర్‌తో పాటు మహాత్మా ఫూలే, సావిత్రిభాయ్‌ ఫూలేకు భారతరత్న కోసం కేంద్రాన్ని అడుగుతామని బీజేపీ తన మేనిఫెస్టోలో తెలిపింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముంబైలో బీజేపీ జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఎన్నికల ప్రణాళికను నడ్డా విడుదల చేశారు. 2025నాటికి మహారాష్ట్రలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ తన మేనిఫేస్టోలో తెలిపింది. మహారాష్ట్రలో నీటి ఎద్దడిని తప్పించేందుకు 11 డ్యామ్‌లతో వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేస్తామని కమళదళం హామీ ఇచ్చింది. అందరీకి అన్ని రకాల మౌళిక సదుపాయాలను కల్పిస్తామని పేర్కొంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.