బీజేపీలో చేరిన వీరప్పన్‌ కూతురు..

By Newsmeter.Network
Published on : 23 Feb 2020 4:45 PM IST

బీజేపీలో చేరిన వీరప్పన్‌ కూతురు..

ఒకప్పుడు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్, అడవి దొంగ వీరప్పన్‌ కూతురు విద్యా రాణి బీజేపీలో చేరారు. తమిళనాడు, హోసూరు జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోని ఓ ప్రైవేట్‌ కళ్యాణ మండపంలో.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రన్, కేంద్ర మాజీ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ల సమక్షంలో ఆమె కషాయ కండువా కప్పుకున్నారు.

దాదాపు రెండు వేల మంది ఆమె మిత్రులు, అనుచరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విద్య మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం పాటుపడతానన్నారు. తన తండ్రి వీరప్పన్ పేద ప్రజల కోసమే జీవించారని, అయితే ఆయన తప్పుడు మార్గంలో పయనించారని చెప్పారు. కుల మతాలకు అతీతంగా పేదలు, బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడతానని పేర్కొన్నారు.

Next Story