రేపే ‘జగనన్న వసతి దీవెన’ ప్రారంభం..

By అంజి  Published on  23 Feb 2020 11:05 AM GMT
రేపే ‘జగనన్న వసతి దీవెన’ ప్రారంభం..

అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ రేపు విజయనగరంలో పర్యటించనున్నారు. అక్కడే జగనన్న వసతి దీవెన పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్‌ బయల్దేరనున్నారు. 11 గంటలకు విజయనగరం పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీ చేరుకోనున్నారు. విజయనగరం అయోద్యా మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్‌ పరిశీలించనున్నారు.

11.25 గంటలకు జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించి.. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, హోంమంత్రి సుచరిత, మంత్రులు తానేటి వనిత, ఇతర అధికారులు హాజరుకానున్నారు. అలాగే పోలీస్‌ బారెక్‌ గ్రౌండ్స్‌లో నిర్మించిన దిశా పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు విజయనగరం నుంచి సీఎం జగన్‌ తిరిగి తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు చేరుకుంటారు.

సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌, అయోధ్య మైదానం, దిశ పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణాల్లో భద్రతాపరమైన తనిఖీలు చేపట్టారు. జిల్లా పోలీసులు, ఏవియషన్‌ వింగ్‌, ఇంటిలిజెన్స్‌ వింగ్‌ కలిసి బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో జిల్లా కలెక్టర్‌ హరి జవహర్‌ లాల్‌, జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 1500 మంది పోలీసులతో సీఎం జగన్‌ పర్యటనకు బందోబస్తు ఏర్పాటు చేశామని, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు.

Next Story
Share it