మ‌హిళా కానిస్టేబుల్‌కు చేయూత‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 March 2020 3:17 PM GMT
మ‌హిళా కానిస్టేబుల్‌కు చేయూత‌

మహిళా కానిస్టేబుల్‌కు చికిత్స నిమిత్తం ఆర్ధిక‌సాయం అంద‌జేశారు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సీసీఆర్బిలో డి.శిల్ప(24) అనే మహిళా కానిస్టేబుల్ పనిచేస్తోంది. ఆమె కొంతకాలంగా 'Pulmonary Endarterectomy' అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధికి సంబంధించి చికిత్సను బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో మాత్ర‌మే చేస్తారని వైద్యులు తెలిపారు. ఈ విష‌య‌మై శిల్ప.. వైద్య చికిత్సకై స్పెషల్ పర్మిషన్ ఇవ్వవలసిందిగా డీజీపీ మహేందర్ రెడ్డికి కోరారు.

ఈ విష‌య‌మై వెంట‌నే స్పందిచిన‌.. డీజీపీ శిల్ప ట్రీట్‌మెంట్‌ కోసం ఆరోగ్య భద్రత ద్వారా రూ. 9,12,320/-మొత్తాన్ని చెక్‌ను విడుద‌ల చేశారు. నేడు ఆ చెక్‌ను సైబరాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్‌.. కానిస్టేబుల్ శిల్ప అక్క రాణికి అందజేశారు. ఈ సంద‌ర్భంగా శిల్ప‌ ట్రీట్‌మెంట్‌ కోసం ఆర్థికంగా ఆదుకున్న డీజీపీ మహేందర్ రెడ్డికి, సైబరాబాద్ వీసీ సజ్జనార్‌కు రాణి ధన్యవాదాలు తెలియజేశారు.

Next Story