మహిళలకు పవన్ కల్యాణ్ గిఫ్ట్.. ‘మగువా మగువా..’ సాంగ్ విడుదల..
By అంజి
ముఖ్యాంశాలు
- 'వకీల్ సాబ్' నుండి 'మగువా మగువా' సాంగ్ విడుదల
- యూట్యూబ్‌లో సంచనాలు సృష్టిస్తోన్న సాంగ్
- వకీల్ సాబ్ సినిమాకు MCA ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం
మహిళా దినోత్సవం సందర్భంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్' నుంచి 'మగువా మగువా' అంటూ సాగే అద్భుతమైన సాంగ్‌ను విడుదల చేశారు. ఇప్పుడి సాంగ్ యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టించేలా ఉంది. ఈ సాంగ్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే 1.5 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్‌ను రాబట్టింది. సంగీత ప్రియులను ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. థమన్ సంగీతం సమకూర్చిన ఈ పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించాడు. ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా’ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ వకీల్‌సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.
బాలీవుడ్ పింక్ సినిమాను రీమేక్ చేస్తూ తెలుగులో వకీల్‌సాబ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ అడ్వకేట్‌గా కనిపించనున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్‌సాబ్ సినిమాను దిల్‌రాజ్, బోనీకపూర్‌లు కలిసి నిర్మిస్తున్నారు. మే 15వ తేదీన వకీల్‌సాబ్ సినిమా విడుదల కానుంది. తాజాగా విడుదలైన ‘వకీల్ సాబ్’ మూవీ లుక్‌ఫై అభిమానులతో పాటు సినీ వర్గాలు సైతం పాటిజివ్‌గా స్పందించాయి. వకీల్ సాబ్‌గా పవన్ కల్యాణ్ ఒక కుర్చీలో కూర్చోని కాలుపై మరో కాలు వేసుకుని కేసు విచారిస్తున్నట్లు పవన్ కల్యాణ్ లుక్ ఉంది. ఇక ట్విటర్‌లో సినిమాకు సంబంధించిన పోస్టులతో #PSPK26FirstLook, #Vakeelsaabలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.