వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ జంటగా ‘వాళ్ళిద్దరి మధ్య’

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Nov 2019 7:04 AM GMT
వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ జంటగా ‘వాళ్ళిద్దరి మధ్య’

'మనసంతా నువ్వే', 'నేనున్నాను', 'ఆట' వంటి హిట్ చిత్రాలు తీసిన దర్శకుడు వి.ఎన్. ఆదిత్య కొత్త చిత్రానికి 'వాళ్ళిద్దరి మధ్య' అనే టైటిల్ ఖరారు చేశారు. విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ ఇందులో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు వి.ఎన్ ఆదిత్య మాట్లాడుతూ...మంచి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చే నిర్మాతతో … మంచి కంటెంట్ ఉన్న కథతో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆర్టిస్టుల ఎంపిక కోసం చాలా కసరత్తులు చేశాం . సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ గారి మేనల్లుడు విరాజ్ అశ్విన్ ఈ కథకు హీరోగా కరెక్టుగా కుదిరాడు. మా చిత్రం కథలో హీరోయిన్ అమెరికా నుండి వస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఉండేలా అమెరికా నుండే హీరోయిన్‌ని పిలిపించాం. అక్కడ చదువుకుంటున్నా కూడా తెలుగు బాగా మాట్లాడగలిగే నేహా కృష్ణ మా కథ నచ్చి ఈ చిత్రంలో చేయడానికి ఒప్పుకుంది. మా చిత్రం ద్వారా ఆమెని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ప్రముఖ కెమేరామ్యాన్ పి.జి. విందా దగ్గర అసోసియేట్ గా పనిచేసిన ఆర్.ఆర్. కోలంచి ఈ చిత్రం ద్వారా కెమెరామేన్ గా పరిచయం చేస్తున్నాం . ఇద్దరు ప్రతినాయకుల లాంటి హీరో హీరోయిన్ మధ్య జరిగే ప్రేమ కథ ఇది. మా పోస్టర్స్ లో కనిపిస్తున్న ‘లోమా’ అంటే ఏంటో , టైటిల్ కి వీళ్ళ కారెక్టర్లకి సంబంధం ఏంటి అనేది త్వరలోనే తెలియజేస్తామన్నారు.

Next Story
Share it