Fact Check : ఉత్తరాఖండ్ కార్చిచ్చు అంటూ వైరల్ అవుతున్న ఫోటోలు ఇక్కడివి కావా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 May 2020 2:56 PM GMT
Fact Check : ఉత్తరాఖండ్ కార్చిచ్చు అంటూ వైరల్ అవుతున్న ఫోటోలు ఇక్కడివి కావా..?

మే నెల పూర్తీ కావస్తోంది. 2020లో ముంచుకొచ్చిన ఉపద్రవాలు అన్నీ, ఇన్నీ కావు. కోవిద్-19, భూకంపం, అంఫాన్ తుఫాను, ఉత్తర భారతదేశం మీద మిడతల దాడి.. ఇలా ఎన్నో చోటుచేసుకున్నాయి.

ఉత్తరాఖండ్ లో కార్చిచ్చు రగులుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు మీడియాలోనూ, సోషల్ మీడియా లోనూ వైరల్ అవుతున్నాయి.

“It’s a moment of utter grief for the entire nation as our devbhoomi Uttarakhand faces the forest fire crisis, and the wildlife specifies that reside in the forest are in grave danger. Please #PrayForUttarakhand that this catastrophe stops with no more loss of our flora & fauna.” అంటూ కొందరు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను వైరల్ చేశారు.ఉత్తరాఖండ్ లోని అడవులను కార్చిచ్చు వెంటాడుతోందని.. ఆ అడవుల్లోని ఎన్నో జంతువులు చనిపోయాయని.. #PrayForUttarakhand అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 2020 అన్నది చాలా చెత్త సంవత్సరం అని.. ఉత్తరాఖండ్ లో అడవులు కార్చిచ్చుకు బలవుతున్నాయని షేర్ చేశారు.టాలీవుడ్ నటుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ట్విట్టర్ లో ఈ ఫోటోలను షేర్ చేశారు.నిజమెంత:

పైన చెబుతున్న సమాచారం 'మిస్ లీడింగ్' సమాచారమే. అందరినీ తప్పుద్రోవ పట్టించే ఫోటోలే.

ఉత్తరాఖండ్ లో కార్చిచ్చు మే 23న మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు గతంలో ఉత్తరాఖండ్ లో వచ్చిన కార్చిచ్చుకు సంబంధించిన ఫోటోలు.. లేదంటే ఇతర దేశాలలో అడవుల్లో ఏర్పడ్డ కార్చిచ్చుకు సంబంధించిన ఫోటోలు.

మర్చి 23న ఏఎన్ఐ వార్తా సంస్థలో ఉత్తరాఖండ్ కు సంబంధించిన ఫోటోలను చూడొచ్చు. పౌరి గర్హ్వాల్ జిల్లాలోని శ్రీనగర్ ప్రాంతంలో కార్చిచ్చు సంభవించింది అని చెప్పారు. ఫారెస్ట్ ఆఫీసర్ అనిత కున్వార్ మాట్లాడుతూ 5 నుండి 6 హెక్టార్ల ఫారెస్ట్ ప్రాంతంపై కార్చిచ్చు ప్రభావం ఉందని.. గాలి కారణంగా కార్చిచ్చును అదుపులోకి తీసుకుని రాలేకపోయామని.. మరిన్ని టీమ్స్ ఘటనా స్థలాల దగ్గరకు వచ్చారని తెలిపారు. ఏఎన్ఐ వెబ్సైట్స్ లో కాకుండా.. ట్విట్టర్ లో కూడా ఈ వార్తను పబ్లిష్ చేశారు.ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా గత 4-5 రోజులుగా అడవుల్లో కార్చిచ్చు దావానంలా వ్యాపిస్తోంది తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలకు, నిజంగా అక్కడ ఉన్న పరిస్థితులకు సంబంధం లేదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలిపింది.

ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయంటూ ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.

“Fake news of forest fire 2020 in Uttarakhand are being circulated on social media. After verification of such images, it has been found that these images are fake. Few such images are being uploaded by us. It is our request to kindly do not spread fake news.”

అప్లోడ్ చేస్తున్న ఫోటోలకు. నిజంగా జరుగుతున్న ఘటనలకు ఎటువంటి సంబంధం లేదని.. దయచేసి ఫేక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకండి అంటూ సూచనలను జారీ చేసింది. వైరల్ అవుతున్న ఫోటోలు ఏయే దేశాలవో కూడా తెలిసేలా చెప్పారు. వైరల్ అవుతున్న ఫోటోలు ఇప్పటివి కావని.. వేరే దేశాలవని.. ఫేక్ ఫోటోలను స్ప్రెడ్ చేయకండని తెలిపారు.ఐపీఎస్ ఆఫీసర్ అశోక్ కుమార్ వైరల్ అవుతున్న వదంతులపైనా, ఫొటోలపైనా అందరికీ క్లారిటీ ఇస్తూ ఓ వీడియో చేశారు. ఎవరైతే రూమర్లను స్ప్రెడ్ చేస్తారో.. వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే కొన్ని మీడియా సంస్థలను కూడా ఆయన ట్యాగ్ చేశారు.అడవుల సంరక్షకుడు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన డాక్టర్ పరాగ్ మధుకర్ కూడా ఉత్తరాఖండ్ లో కార్చిచ్చుకు సంబంధించిన సరైన సమాచారాన్ని అందరికీ తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఫోటోలలో చూపిస్తున్నట్లు వైరల్ అవుతున్న వార్తలు నిజం కావని అన్నారు. సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసే ముందు ఆలోచించాలని సూచించారు.

సోషల్ మీడియాలోని ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. చాలా వరకూ ఆ ఫోటోలు వేరే దేశాలకు సంబంధించినవని తెలిసింది.

వాటిలో ఇంకొన్ని ఉత్తరాఖండ్ లో 2016లో వచ్చిన కార్చిచ్చుకు సంబంధించిన ఫోటోలు.

ఉత్తరాఖండ్ అడవులు తగలబడుతున్న వార్తలు నిజమే.. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు మాత్రం ఇప్పటివి కావు.. ఈ దేశానికి చెందినవి కావు.

వైరల్ అవుతున్న ఫోటోలకు ఇప్పటి ఘటనకు 'ఎటువంటి సంబంధం లేదు'.

Claim Review:Fact Check : ఉత్తరాఖండ్ కార్చిచ్చు అంటూ వైరల్ అవుతున్న ఫోటోలు ఇక్కడివి కావా..?
Claim Fact Check:false
Next Story