Fact Check : జయలలితతో పాటు ఫోటోలో ఉన్న మహిళ ఎవరు ? నిర్మలా సీతారామన్‌ అని జరుగుతున్న ప్రచారం నిజమేనా ?

By Newsmeter.Network  Published on  30 May 2020 6:55 AM GMT
Fact Check : జయలలితతో పాటు ఫోటోలో ఉన్న మహిళ ఎవరు ? నిర్మలా సీతారామన్‌ అని జరుగుతున్న ప్రచారం నిజమేనా ?

ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతుంటే మిస్‌ ఇన్ఫర్మేషన్‌, డిస్‌ ఇన్ఫర్‌మేషన్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారిపోతోంది. విషయం ఏదైనా, ఎవరికి సంబంధించిన అంశమైనా సెన్సేషన్‌ కోసం కొందరు తప్పుడు వార్తలు పో్ట్‌ చేస్తున్నారు. మరికొందరు తమకు తెలియకుండానే తప్పుడువార్తలను వైరల్‌ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఓ ఫోటో కొద్దిరోజుగా వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో తిరుగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఫోటో అది. అయితే.. జయలలితతో పాటు మరో మహిళ కూడా ఆ ఫోటోలో ఉన్నారు. ఎంతో సన్నిహితంగా ఇద్దరూ కలిసి ఓ భారీ కుర్చీలో కూర్చొని ఫోటో దిగారు. జయలలిత దాదాపుగా టీనేజ్‌ వయసులో ఉన్నప్పుడు తీయించుకున్న ఫోటో అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. జయలలితతో పాటు ఉన్న మహిళ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుత కోవిడ్‌-19 శకంలో నిర్మలా సీతారామన్‌ గతంలోకన్నా బాగా పాపులర్‌ అయిపోయారు. ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించిన 21 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు నిర్మలాసీతారామనే మీడియా ముఖంగా ప్రజలకు వివరించారు. ఈ ప్యాకేజీని మొదటగా ప్రకటించింది ప్రధాని నరేంద్రమోదీ అయినా.. వివరంగా చెప్పింది మాత్రం నిర్మలా సీతారామన్‌. దీంతో.. కొద్దిరోజులుగా ఆమె వార్తల్లో నిలుస్తున్నారు. ఇదే సమయంలో ఈఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నవాళ్లు జయలలితతో పాటు ఫోటోలో ఉన్న మహిళ నిర్మలా సీతారామన్‌ అంటూ రైటప్‌లు పెడుతున్నారు.

ఫేస్‌బుక్‌ లింక్‌ : https://www.facebook.com/photo.php?fbid=1371422839735133&set=pb.100006022900009.-2207520000..&type=3&theater

ఈ ఫోటోను చూసిన వాళ్లంతా కూడా ఇది నిజమేనేమో అని అనుకుంటున్నారు. తాము కూడా తమ ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో ఉన్నవాళ్లకు ఫార్వార్డ్‌ చేస్తున్నారు. అయితే.. ఇది నిజమేనా ? అన్న అంశంపై న్యూస్‌మీటర్‌ ఫ్యాక్ట్‌చెక్‌ చేసింది. ఈ వెరిఫికేషన్‌లో జయలలితతో పాటు.. ఫోటోలో ఉన్న మహిళ నిర్మలాసీతారామన్‌ కాదని నిర్ధారణ అయ్యింది.

జయలలితతో పాటు ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ కాదు.. తమిళ రచయత్రి శివశంకరి. 2015లోనే ఈ పోస్ట్‌ ఫేస్‌బుక్‌లో కనిపించింది. 'For the love of Sari' అనే ఫేస్బుక్‌ యూజర్‌ ఈ ఫోటోను మే 25, 2015లో ఈ ఫోటోను పోస్ట్‌చేశారు.

Fact check - Jayalalitha with Nirmala Sitharaman

Fact check - Jayalalitha with Nirmala Sitharaman

Fact check - Jayalalitha with Nirmala Sitharaman

సో.. ట్రెండ్‌ అవుతున్న అంశాలు, వ్యక్తులను టార్గెట్‌గా చేసుకొని సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు సృష్టించి వైరల్‌గా మార్చడం కొద్దిరోజులుగా గమనిస్తూనే ఉన్నాం. ఇది కూడా ఆ కోవకే చెందుతుందని న్యూస్‌మీటర్‌ ఫ్యాక్ట్ చెకింగ్‌లో తేలింది.

ప్రచారం : జయలలితతో ఫోటోలో ఉన్న మహిళ.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌.

వాస్తవం : జయలలితతోపాటు ఈ ఫోటోలో ఉన్న మహిళ తమిళ రచయిత్రి శివశంకరి.

కంక్లూజన్‌ : సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటోలను ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకుంటే తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయవచ్చు.

Claim Review:Fact Check : జయలలితతో పాటు ఫోటోలో ఉన్న మహిళ ఎవరు ? నిర్మలా సీతారామన్‌ అని జరుగుతున్న ప్రచారం నిజమేనా ?
Claim Fact Check:false
Next Story