ఉత్తరప్రదేశ్‌లో ఏలియన్..? భయాందోళనకు గురైన ప్రజలు..!
By సుభాష్ Published on 18 Oct 2020 6:59 AM GMTగ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా..? లేరా..? అనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. వాళ్లు నిజంగా ఉన్నారో లేరో మనకు తెలీదు. వాళ్లు గురించి తెలుసుకోవాలని అందరికి ఆసక్తి ఉంటుంది. అయితే.. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అది కూడా ఒక బెలూన్ చూసి. కామిక్ క్యారెక్టర్ అయిన ఐరన్ మ్యాన్ ని పోలి ఉన్న ఓ బెలూన్ ని చూసి స్థానికులు గ్రహాంతరవాసిగా భావించారు. అది ఏలియన్‌లాగానే గాల్లోంచి నేలపై దిగటంతో బిక్కచచ్చిపోయారు.
వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడాలోని దాన్‌కౌర్ ప్రాంతంలో నిన్న ఉదయం ఓ వింత ఆకారం గాల్లో ఎగురుతూ కనిపించింది. కొంతసేపటి తర్వాత ఓ కాలువలోకి దిగి, అక్కడే కొద్దిసేపు కదులుతూ కనిపింది. గ్రహాంతరవాసి అని భావించి జనం చూడటానికి గుమిగూడారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని బెలూన్‌ను పట్టుకున్నారు. అది ఏలియన్ కాదని.. ఐరన్ మ్యాన్‌ను పోలి ఉన్న బెలూన్ పోలీసులు తెలిపారు. దాని ఆకారాన్ని చూసి జనాలు భయపడ్డారని.. ఈ బెలూన్ ను ఎవరు ఎగరేశారనే విషయం ఇంకా తెలియలేదని అన్నారు.