టిక్ టాక్ పై ఫైర్ అవుతోన్న యూజర్లు

By రాణి  Published on  7 April 2020 12:24 PM GMT
టిక్ టాక్ పై ఫైర్ అవుతోన్న యూజర్లు

టిక్ టాక్..ఇప్పుడు ఇది లేకుండా క్షణమైనా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా యువత తెల్లారి లేస్తే..రాత్రి పడుకునేంత వరకూ టిక్ టాక్ తోనే గడిపేస్తున్నారు. ఒకవేళ టిక్ టాక్ చేసేంత తీరిక లేకపోతే..సమయం కుదుర్చుకుని మరీ టిక్ టాక్ చేస్తున్నారు. ఇలా టిక్ టాక్ వల్ల ఫేమస్ అయిన వాళ్లెందరో ఉన్నారు. టిక్ టాక్ వల్ల చెడు ఎంతుందో..జ్ఞానం కూడా అంతే ఉంది. అయితే ఇప్పుడు ఈ టిక్ టాక్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నాయి. అందుకు కారణం ఏంటా అనుకుంటున్నారా ? కరోనా అండి. చైనా తయారు చేసిన టిక్ టాక్ ను 600 మిలియన్ల మంది ఉపయోగిస్తుంటే..అందులో సగం యూజర్లు భారతీయులే ఉన్నారు.

Also Read : కడపలో .. కరోనా కుమారి, కరోనా కుమార్

చైనా తయారు చేసిన ఏ వస్తువులకైనా భారత్ లో గిరాకీ ఎక్కువ. అలాగే అదే చైనా వదిలిన కరోనా వైరస్ కూడా ప్రస్తుతం భారతీయులను పట్టి పీడిస్తోంది. లాక్ డౌన్ చేస్తే వైరస్ వ్యాప్తి తగ్గుతుందనుకుంటే..గడిచిన 14 రోజుల్లో వైరస్ తీవ్రత చాలా అధికంగా ఉంది. రోజురోజుకూ వందల సంఖ్యలో కొత్తకేసులు బయటపడుతున్నాయి. నిజానికి దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తెలుగు రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా ఉందని చెప్పాలి. ఎలా అంటారా ? అధికంగా తమిళనాడులో 600 కు పైగా కేసులు నమోదయ్యాయన్నారు. కానీ ఆంధ్రా, తెలంగాణ విడిపోకుండా ఉండుంటే..కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయ్యుండేది కదా. ఇక అసలు విషయానికొస్తే..కరోనా వైరస్ వల్ల దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 100 దాటేసింది. కేసుల సంఖ్య 5 వేలకు చేరువలో ఉంది. అందుకే చైనా తయారు చేసిన టిక్ టాక్ ను ఇప్పుడు నెటిజన్లు అసహ్యించుకుంటున్నారు. బాగా అలవాటైన టిక్ టాక్ ను వదిలేయడం వారి మనసుకు భారంగానే ఉన్న..చైనా మీద కోపంతో చాలా మంది యూజర్లు టిక్ టాక్ ను అన్ ఇన్ స్టాల్ చేస్తున్నట్లు సమాచారం. భారత్ లో చైనా వ్యాపారాన్ని కట్టడి చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read : కరోనా బాధితులు..మరణాల్లో పురుషుల శాతమే ఎక్కువ

Next Story