కడపలో .. కరోనా కుమారి, కరోనా కుమార్

By రాణి  Published on  7 April 2020 8:44 AM GMT
కడపలో .. కరోనా కుమారి, కరోనా కుమార్

కరోనా రక్కసి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంటే..కరోనా వైరస్ విజృంభిస్తున్న రోజుల్లో పుడుతున్న కవలలకు కరోనా, కోవిడ్, లాక్ డౌన్ అని పేర్లు పెడుతున్నారు తల్లిదండ్రులు. దీంతో పురోహితులు కూడా కోవిడ్, కరోనా నామధేయస్య..సహకుటుంబానామ్ అంటూ నామకరణ తంతును కానిచ్చేస్తున్నారు. తాజాగా కడప జిల్లా వేంపల్లె ఆస్పత్రిలో ఇద్దరు గర్భిణులు పిల్లలకు జన్మనిచ్చారు. ఇద్దరు పిల్లలకు వైద్యుడు కరోనా కుమారి, కరోనా కుమార్ అని పేర్లు పెట్టేశారు. అందుకు పిల్లల తల్లిదండ్రులు కూడా అంగీకరించడం కొసమెరుపు. ఏపీలో కరోనా కాలంలో పుట్టిన పిల్లలకు ఇలాంటి పేర్లు పెట్టడం ఇదే తొలిసారి. కానీ దేశంలో వీరికన్నా ముందు పుట్టిన పిల్లలకు కూడా కరోనా, కోవిడ్ అని పేర్లు పెట్టారు.

Also Read : కరోనా బాధితులు..మరణాల్లో పురుషుల శాతమే ఎక్కువ

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఆసుపత్రిలో లాక్డౌన్ మధ్య ప్రీతి వర్మ (27) కవలలకు జన్మనిచ్చింది. ఈ దంపతులు తమ పిల్లలకు కరోనా, కోవిడ్ అని పేరు పెట్టారు. తమ పిల్లల పేర్లు తమ కష్టాలపై విజయం, ఆసుపత్రి సహకారం రెండింటినీ గుర్తు చేస్తూనే ఉంటాయని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వేంపల్లె మండలంలోని అలిరెడ్డిపల్లెకు చెందిన రమాదేవి, తాళ్లపల్లెకు చెందిన శశికళ పురిటి నొప్పులతో పట్టణంలోని బాషా ఆసుపత్రిలో చేరారు. ఒకరికి అమ్మాయి, మరొకరి అబ్బాయి పుట్టడంతో వారికి కరోనా కుమారి, కరోనా కుమార్ అని నామకరణం చేశారు.

Also Read : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు..ప్రపంచమంతా అనారోగ్యం

గతంలో కూడా ఏ విపత్తు వస్తే..దాని పేరు పిల్లలకు పెట్టిన దాఖలాలున్నాయి. 1979లో అమెరికా తొలి స్పేస్ స్టేషన్ స్కైలాబ్ హిందూ మహాసముద్రంలో కుప్పకూలింది. ఆ సమయంలో పుట్టిన పిల్లలకు స్కైలాబ్ అని పేర్లు పెట్టారు.

Next Story
Share it