ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు..ప్రపంచమంతా అనారోగ్యం

By రాణి  Published on  7 April 2020 6:05 AM GMT
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు..ప్రపంచమంతా అనారోగ్యం

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం..ప్రతి ఏడాది సంగతి పక్కన పెడితే ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో సుమారు 13 లక్షల 50 వేల మంది ఆస్పత్రులపాలయ్యారు. 75 వేల మంది మృతి చెందారు. ఇంకా ఈ సంఖ్య ఎంత పెరుగుతుందో అంచనాలకు అందని పరిస్థితి. అగ్రరాజ్యం కరోనా ధాటికి వణికిపోతోంది. ఎలా కట్టడి చేయాలో తెలియక భారత్ లో కరోనా చికిత్సకు వాడుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను తమకు కూడా అందించాలని అర్థించింది. ఒకరకంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు భూమండలం అనారోగ్యానికి గురైందనే చెప్పాలి.

Also Read : ఇవి తినండి..రోగనిరోధక శక్తిని పెంచుకోండి

ఉరుకుల పరుగుల జీవితం..ఆరోగ్యంపై శ్రద్ధ చూపే క్షణం తీరిక ఉండేది కాదు. ఆదరా బాదరా టిఫిన్లు వేసి, వంట చేసి..ఓ ముద్ద బాక్సు కట్టుకుని..దానిని పట్టుకుని గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి నానా కష్టాలు పడుతూ ఆఫీసులకు వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు కరోనా కారణంగా 21 రోజులు లాక్ డౌన్. అందులో 14 రోజులు అయిపోయాయి. ఇంకా వారంరోజులకి లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తివేస్తారో..లేక గడువును మరింత పెంచుతారో తెలియదు. కానీ కరోనాను ఎదుర్కోవాలంటే మాత్రం మనలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే ఏకైక మార్గం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఏమేమి తినాలన్న విషయం గురించి ఇంతకు ముందు రెండు, మూడు సార్లు చెప్పుకున్నాం..ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం.

Also Read : తాటిముంజల వల్ల ఉపయోగాలెన్నో..మీకు తెలుసా ?

1.ఉదయాన్నే నిద్రలేవగానే పరకడుపున రెండు నుంచి మూడు గ్లాసుల నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా పొద్దున్నే నీరు తాగడం వల్ల మలబద్దకం పోతుంది. అలాగే మొలకెత్తిన గింజలు తినడం అలవాటు చేసుకోవాలి.

2. ఉదయం పది నుంచి 15 నిమిషాల పాటు యోగా లేదా వ్యాయామం చేయాలి. యోగా చేయడం వల్ల శరీరానికి పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

3.ఉసిరి లేదా..త్రిఫలాలు అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ నానబెట్టిన నీటిని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

4.వారానికోరోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే మరీ ఏమీ తినకుండా కాదు. అన్నం మినహా..పాలు, పండ్లు వంటివి తినాలి.

Also Read : గ్యాస్ ట్రబుల్ ఉందా ? ఇంట్లోనే ఇవి ట్రై చేయండి

5.టీ, కాఫీ లు తాగడం తగ్గించుకోవాలి. సిగరెట్లు, పొగాకు తాగడం, మద్యపానం వంటి అలవాట్లను మానుకోవాలి.

6.మీరు తీసుకునే ఆహారంలో పులుపు, కారం, మసాలా, చక్కెర, వేపుడు వంటి పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే నూనె తక్కువగా ఉన్న ఆహారం తినడం ఉత్తమం.

7. ఉదయం తినే టిఫిన్ చాలా తేలికగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా పరగడుపున నూనెలో వేయించిన టిఫిన్లను తినడం తగ్గించుకోవాలి. నూనెతో కూడిన పదార్థాలను తినడం గుండెకు చేటు చేస్తుంది.

8.ఇంటి పనుల వల్లనో..ఉద్యోగ రీత్యా ఉన్న టెన్షన్ వల్లనో మానసిక ఒత్తిడి పెరగడం సహజం. అలాంటపుడు మీకిష్టమైన సంగీతం వినడమో లేక పుస్తక పఠనం చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.

Also Read : లైంగిక శక్తిని పెంచే తాటిబెల్లం

Next Story