ఉప్ప‌ల్ హెరిటెజ్ సిబ్బందికి క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 April 2020 4:30 PM GMT
ఉప్ప‌ల్ హెరిటెజ్ సిబ్బందికి క‌రోనా

ఉప్ప‌ల్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. రామంతాపూర్ చ‌ర్చికాల‌నీలో ఒకే ఇంట్లో ముగ్గ‌రికి క‌రోనా పాజిటివ్ గా నిర్థార‌ణ అయ్యింది. ఆ ఇంట్లోని ఓ వ్య‌క్తి ఉప్ప‌ల్ హెరిటెజ్ ప్లాంట్‌లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. దీంతో హెరిటెజ్‌లోని 35 మంది సిబ్బందికి స్టాంపులు వేసి హోం క్వారంటైన్ లో ఉండాల‌ని ఉప్ప‌ల్ పోలీసులు సూచించారు.

ఇక సెక్యురిటీ గార్డుకు క‌రోనా వ‌చ్చిన విష‌యాన్ని యాజ‌మాన్యం దాచిపెట్టింది. క‌రోనా వ‌చ్చినా స‌రే.. సెక్యూరిటీ గార్డులను డ్యూటీకి రావాలంటూ యాజమాన్యం ఒత్తిడి తీసుకొచ్చింది. సిబ్బందికి క‌రోనా వ‌చ్చినా యాజ‌మాన్యం ప్లాంట్ న‌డప‌డ‌మే కాక‌.. ప్రభుత్వ అధికారులకు చెప్పొద్దంటూ సిబ్బందికి ఆదేశాలు సైతం జారీ చేశారు. క్వారంటైన్ స్టాంపులు ఉన్న వాళ్లు తిరుగుతుండ‌డంతో హెరిటేజ్‌ ప్లాంట్‌ ఎదుట స్థానికులు ధర్నాకు దిగారు. ప్లాంట్‌ను మూసివేయాలంటూ ఆందోళన చేపట్టారు

Next Story