హైదరాబాద్‌లో 45 కంటైన్ మెంట్ల జోన్ల ఎత్తివేత!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 April 2020 7:38 AM GMT
హైదరాబాద్‌లో 45 కంటైన్ మెంట్ల జోన్ల ఎత్తివేత!

తెలంగాణ రాష్ట్రంలో క‌రోన మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఇప్ప‌ట‌కే 990 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా వ్యాప్తిని నియంత్రించ‌డంతో భాగంగా దేశ వ్యాప్త లాక్‌డౌన్ మే3 వ‌ర‌కు పొడిగించ‌గా.. తెలంగాణ‌లో మే 7 వ‌ర‌కు పొడిగించిన సంగ‌తి తెలిసిందే. కొన్ని చోట్ల అత్య‌ధిక కేసులు న‌మోద‌వుతుండ‌డంతో కంటైన్‌మెంట్స్ ఏర్పాటు చేశారు.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టింది. హైద‌రాబాద్‌లోని మూడు క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో కొన‌సాగుతున్న కంటైన్‌మెంట్ జోన్ల‌లో 45 జోన్ల‌ను ఎత్తివేసిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ జోన్లలో క‌రోనా రోగులు కోలుకోవ‌డంతో పాటు కొత్త కేసులు న‌మోదుకాక‌పోవ‌డంతో నిబంధనలను తొలగించామన్నారు.

అయినప్ప‌టికి ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ.. మిగతా ప్రాంతాల్లో మాదిరిగా తగు జాగ్రత్తలు తీసుకుని, తమతమ రోజువారీ పనులను చేసుకోవచ్చని వెల్లడించారు. ప‌రిస్థితి బ‌ట్టి రేప‌టి నుంచి ద‌శ‌ల వారీగా ఆంక్ష‌ల‌ను సడ‌లించ‌నున్న‌ట్లు తెలిపారు.

Next Story