కూక‌ట్‌ప‌ల్లి సీఐని ప్ర‌శంసించిన హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 April 2020 3:49 PM GMT
కూక‌ట్‌ప‌ల్లి సీఐని ప్ర‌శంసించిన హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి

కూకట్‌పల్లి సీఐ బి.ఎల్.లక్ష్మినారాయణ రెడ్డిని హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జైరామ్‌ఠాకూర్ అభినందించారు. వివ‌రాల్లోకి వెళితే.. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించ‌డంతో.. హిమాచ‌ల్‌ప్రదేశ్‌కు చెందిన ల‌లిత్‌కుమార్ కూక‌ట్‌పల్లిలో చిక్కుకుపోయాడు. అత‌ను తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ల‌లిత్‌కు అత్య‌వ‌స‌ర శ‌స్త్ర చికిత్స‌కు రూ.20వేలు అవ‌స‌రం అయ్యాయి. వెంట‌నే కూక‌ట్‌ప‌ల్లి సీఐ లక్ష్మినారాయణ రెడ్డి త‌న జేబు నుంచి ఆ మొత్తాన్ని చెల్లించారు. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌కు చెందిన వ్య‌క్తికి వైద్యం చేయడంతో పాటు ఆస్ప‌త్రి బిల్లు చెల్లించి మాన‌వ‌త్వం చాటుకున్నందుకు సిఐ ల‌క్ష్మినారాయ‌ణ రెడ్డిని సీఎం జైరామ్ ఠాకూర్ ప్ర‌శంసించారు. కొవిడ్‌-19పై పోరాటం చేస్తూ.. ఆప‌ద‌లో అండ‌గా నిలిచే మీ వ్య‌క్తితం ప‌లువురికి ఆద‌ర్శ‌నీయం అని సీఎం కొనియాడారు.

Next Story