ట్రైన్ టిక్కెట్ దొరకలేదని.. ఏకంగా కారు కొన్నాడు
By తోట వంశీ కుమార్
లాక్‌డౌన్‌లో ఓ వ్యక్తి వేరే ప్రాంతంలో చిక్కుకున్నాడు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగిస్తుండడంతో సొంతూరి వెళ్లాలని బావించాడు. వలస కార్మికులను తమ స్వస్థలాలకు పంపిచేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లలను ఏర్పాటు చేయడంతో అందులో వెళ్లాలని భావించాడు. తనకు, తన కుటుంబ సభ్యులకు ట్రైన్ టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే.. టిక్కెట్లు దొరకక పోవడంతో కారు కొని అందులో సొంతూరికి వెళ్లాడు.
గోరఖ్‌పూర్‌కి చెందిన లల్లాన్ అనే వ్యక్థి ఘజియాబాద్‌లో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ తొందరగానే ముగుస్తుందని భావించగా.. కేంద్రం ఎప్పటికప్పుడు లాక్‌డౌన్‌ను పొడిగించడంతో తన సొంతూరికి వెళ్లాలని భావించాడు. శ్రామిక్ రైళ్లలో తనకు, తన కుటుంబ సభ్యులకు కలిపి టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. మూడు రోజుల ప్రయత్నించినా టికెట్లు బుక్ కాలేదు. అప్పటి వరకు తాను దాచుకున్న సేవింగ్స్ రూ.1.9లక్షల నుంచి రూ.1.5లక్షలు డ్రా చేసి సెకండ్ హ్యాండ్ కారు కొని ఈ నెల 29న గోరఖ్‌పూర్‌లోని ఇంటికి చేరుకున్నాడు.
లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగిస్తుండడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. సొంతూరి వెళ్లాలని అనుకున్నా. సోషల్ డిస్టన్స్ పాటిస్తూ వెళ్లడానికి రైలు బాగుంటుందని అనుకున్నా.. బస్సులో అయితే రద్దీగా ఉంటుంది. బస్సులో వెళితే.. కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో రైలు టిక్కెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నించా. అయితే టిక్కెట్లు దొరకలేదు. తన కుటుంబంతో క్షేమంగా ఇంటికి వెళ్లాలని భావించి సెకండ్ హ్యాండ్ కారు కొన్న. సొంతూరిలోనే ఏదో ఒక పనికి ప్రయత్నిస్తున్న. దొరికితే మాత్రం ఇక ఎక్కడికి వెళ్లనని లల్లాన్ అన్నాడు.
సొంతూరికి చేరుకున్న లల్లాన్ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాడు.