యూపీలో ఘోర ప్రమాదం.. అస‌లేమైంది.?

By Medi Samrat
Published on : 14 Oct 2019 12:27 PM IST

యూపీలో ఘోర ప్రమాదం.. అస‌లేమైంది.?

ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మావ్ జిల్లాలోని మహమ్మదాబాదులో గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.

ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియచేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రమాదానికి సిలిండర్ పేర్లు మాత్రమే కారణమా, అసలు పేలుడు ఎలా జరిగింది వంటి అంశాలను తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:

https://telugu.newsmeter.in/nirmala-ola-uber-comment/

Next Story