పాము భయంతో వణికిపోతున్న యువకుడు.. ఒకే పాము 8 సార్లు కాటువేసిందట..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sep 2020 10:09 AM GMT
పాము భయంతో వణికిపోతున్న యువకుడు.. ఒకే పాము 8 సార్లు కాటువేసిందట..!

పాములు పగ బడతాయా..? ఏమో ఆ విషయం అయితే తెలీదు కానీ.. ఓ యువకుడు మాత్రం తనను ఒకే పాము 8 సార్లు కాటు వేసిందని చెబుతున్నాడు. అదీ కూడా ఒకే నెలలో. అదృష్టం ఏమిటంటే.. అన్ని సార్లు పాము కాటుకు గురి అయిన అతను బతికి బట్టకట్టడం. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా రాంపూర్ గ్రామంలో యశ్‌రాజ్‌ మిశ్రా అనే 17 ఏళ్ల యువకుడు నివసిస్తున్నాడు. ప్రతి క్షణం పాము భయం అతడిని వెంటాడుతోంది. ఎక్కడి వెళ్లినా.. ఎని చేసినా.. ఉలిక్కి పడుతున్నాడు. ఒకే నెలలో ఎనిమిది సార్లు ఆస్పత్రి మెట్లు ఎక్కాడు. ఆ పాము అతడిని చివరి సారిగా వారం రోజుల క్రితం కరిచినట్లు చెబుతున్నాడు.

యశ్‌రాజ్‌ను మూడు సార్లు పాము కరిచిన తరువాత అతడిని బహదూర్‌పూర్‌ గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి పంపించారు అతడి తల్లిదండ్రులు. కొద్ది రోజులు అనంతరం అదే పాము అక్కడి ఇంటి సమీపంలో కనిపించి కాటు వేసింది. ఇక పామును వదిలించుకోవడం తన వల్ల కాదని డిసైడైన మిశ్రా.. బంధువుల ఇంట్లో ఉండడం వేస్టు అని తిరిగి సొంతూరికి తిరిగి వచ్చాడు. అక్కడ మరో నాలుగు సార్లు ఆ పాము అతడిని కాటు వేసింది.

'వరుస సంఘటనలో మా అబ్బాయి మానసిక ఆందోళనకు లోనవుతున్నాడు. పాము భయంతో వణికిపోతున్నాడు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు అనేక పూజలు చేయించాం. ఎంతో మంది పాములు పట్టేవారిని పిలిచాం. కానీ ఎలాంటి ఫలితం లేకపోయిందని అతడి తండ్రి చంద్రమౌళి మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ పాము యశ్‌రాజ్‌ను ఈ నెల 25న ఆఖరి సారిగా కరిచిందట. ఇంతకీ ఆ పాము అతడిని ఎందుకు కాటువేస్తుందోనని ఎవరికి తెలియట్లేదు.

Next Story
Share it