లక్నో: కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ తనకు విదేశాల్లో ఎదురైన వింత అనుభవం గురించి చెప్పారు. ఆమె పేరులోని ఇరానీ అనే పదాన్ని చూసి విదేశీ ఎయిర్‌పోర్టుల్లో అడ్డుకుంటున్నారట. స్మృతి ఇరానీకి పేరు కష్టాలు మొదలయ్యాయట. ఈ విషయాన్ని ఓ కార్యక్రమంలో స్మృతి ఇరానీ చెప్పారు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అడిగే ప్రశ్నలకు తాను ఒక్కటే సమాధానం చెబుతానన్నారు.

‘నా పేరు స్మృతి ఇరానీ.. నా దేశం ఇండియా’ అంటానని ఆమె అంటున్నారమె. లక్నో జరుగుతున్న హిందుస్థాన్‌ శిఖర్‌ సమాగమ్‌ కార్యక్రమంలో స్మృతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చారు.

తన పేరు చివర ఉన్న ఇరానీ.. చూసి విదేశీ ఎయిర్‌పోర్టుల్లో అడ్డుకొని ఇది ఏ ఇరానీ అని అడుతుంటారని, అయితే వాళ్లకు తాను ‘నేను ఇండియా వాలీ ఇరానీ’ ఒక్కటే సమాధానం చెబుతానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమేథీ గురించి ప్రస్తావించారు. అమేథీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. ఇందుకోసమే ఆమేథీలో ఇళ్లు కట్టుకున్నానని స్మృతి ఇరానీ చెప్పారు. తాను ముంబై నుంచి ఎప్పుడో వచ్చేశానన్నారు. ఆమేథీలో, ఢిల్లీలో ఉంటానని ఆమె తెలిపారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమేథీలో రాహుల్‌ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించింది. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం స్మృతి ఇరానీపై రాహుల్‌ గాంధీ లక్ష ఓట్లపైగా మెజారీ విజయం సాదించారు. స్మృతి ఇరానీ తరచూ అమేథీలో పర్యటిస్తూ ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. అమేథీలో రూ.10 వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. సామాన్యుల ఆకాంక్షలకు తగినట్లుగా అధికారులు పని చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.