Fact Check : ఆ అప్పడాలు తింటే కరోనా వైరస్ ను తరిమేయొచ్చని చెబుతున్న యూనియన్ మినిస్టర్ మేఘవాల్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 July 2020 3:58 PM GMT
Fact Check : ఆ అప్పడాలు తింటే కరోనా వైరస్ ను తరిమేయొచ్చని చెబుతున్న యూనియన్ మినిస్టర్ మేఘవాల్..!

యూనియన్ మినిస్టర్ అర్జున్ రామ్ మేఘవాల్ 'భాబీజీ పాపడ్'(అప్పడాలు) తింటే కరోనాను దూరం చేయొచ్చు అని చెబుతున్నారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరికొత్త స్కీమ్ ఆత్మనిర్భర్ కింద ఈ అప్పడాలను తయారు చేశామని.. ఇవి తింటే రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా కరోనాతో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుందని.. ప్రతిరోధకాలు శరీరంలో పెరుగుతాయని ఆయన అంటున్నారు. ఆయన 'భాబీజీ పాపడ్' ను ప్రమోట్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పలు మీడియా సంస్థలు కూడా ఈ వార్తలను ప్రచురించాయి. రాజస్థాన్ లోని బికనీర్ లో ఈ అప్పడాలు తయారు చేస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించే పలు పదార్థాలను ఉపయోగించి ఈ అప్పడాలను తయారుచేశామని ఆయన తెలిపారు.

P1

https://www.deccanchronicle.com/nation/current-affairs/250720/bhabhiji-papad-has-ingredients-to-fight-covid-19-union-minister-arj.html



నిజ నిర్ధారణ:

హెర్బల్ పదార్థాలు, మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం వలన మనిషిలో రోగ నిరోధక శక్తి అన్నది పెరుగుతుంది కానీ.. ఒంటిలో ప్రతిరోధకాలు పెరగవు. ఈ అప్పడాలు తింటే కరోనా వైరస్ ను తరిమేయొచ్చు అని చెబుతున్న యూనియన్ మినిస్టర్ మేఘవాల్ వ్యాఖ్యల్లో నిజం లేదు.

అప్పడాలను వివిధ రకాల పదార్థాలతో తయారుచేస్తూ ఉంటారు. మినపపప్పు, శెనగపప్పు, వివిధ రకాల ధాన్యాలు ఉపయోగిస్తూ ఉంటారు. వీటికి కొన్ని ఫ్లేవర్లను యాడ్ చేస్తూ ఉంటారు. మినప పప్పులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ మాత్రమే కాకుండా.. ఎనర్జీ లెవల్స్ పెరగడానికి దోహదపడుతుంది. అంతేకానీ ప్రతిరోధకాలు పెంపొందడానికి ఎటువంటి సహాయం చేయవు.

మూలికల వంటి పదార్థాల కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కానీ ప్రతిరోధకాలు శరీరంలో పెరగవు.

ఆయుష్ మినిస్ట్రీ కూడా ఎన్నో పదార్థాలు ఇమ్యూనిటీని పెంపొందింపజేస్తాయని చెబుతోంది. ఇమ్యూనిటీని పెంపొందించడానికి, శరీరంలో ప్రతిరోధకాలు పెరగడానికి చాలా తేడాలు ఉన్నాయని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Britannica.com కథనం ప్రకారం ఏదైనా శరీరానికి హాని కలిగించే పదార్ధం శరీరంలోకి ప్రవేశిస్తే రోగ నిరోధక వ్యవస్థకు ముందుగానే తెలిసిపోతుంది. అప్పుడు శరీరంలోని ప్రతిరోధకాలు ఆ వైరస్ ను శరీరంలో నుండి తీసివేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రతిరోధకాలు తెల్ల రక్త కణాలతో కలిసి శరీరంలో ప్రవేశించిన వైరస్ లాంటి పదార్థాలతో పోరాడుతూ ఉంటాయి.

సెల్ మెడికేటెడ్ ఇమ్యూనిటీ కూడా మానవ శరీరంలో ఉంటుందని The Hindu లో కథనం ప్రచురితమైంది. ఇందులో ప్రతిరోధకాలు అన్నవి ఉండవు.

రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఎన్నో పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. కానీ కోవిద్-19 ను అదుపు చేసే రోగ నిరోధక శక్తి ఉన్న పదార్థాలు అన్నది ఇంకా శాస్త్రీయంగా తెలియరాలేదు. యూనియన్ మినిస్టర్ మేఘవాల్ చేసిన వ్యాఖ్యలని ఎయిమ్స్ డాక్టర్ బి.వెంకటేశ్వర రావు ఖండించారు. ఇలాంటి సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు అని అన్నారు. తప్పుద్రోవ పట్టించే వ్యాఖ్యలు చేయకూడదని కోరారు. అప్పడాల్లో ఉపయోగించే పదార్థాలు కేవలం రోగ నిరోధక శక్తిని మాత్రమే పెంపొందిస్తాయి. అంతేకానీ కోవిద్-19ను అరికట్టగలిగే ప్రతిరోధకాలను పెంపొందించలేవు. కోవిద్-19 సోకిన తర్వాతనే శరీరంలో ప్రతిరోధకాలు పెరుగుతాయని వెంకటేశ్వర రావు తెలిపారు.

అప్పడాలు తింటే కరోనా వైరస్ ను తరిమేయొచ్చు అని చెబుతున్న యూనియన్ మినిస్టర్ మేఘవాల్ వ్యాఖ్యలలో నిజం లేదు.

Next Story