Fact Check : అమెరికాలో నిరసన కారులను పోలీసులు మరీ ఇంత దారుణంగా కొడుతున్నారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 July 2020 11:27 AM GMT
Fact Check : అమెరికాలో నిరసన కారులను పోలీసులు మరీ ఇంత దారుణంగా కొడుతున్నారా..?

ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిని అరికట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా ఒక్క కరోనా మహమ్మారితో మాత్రమే పోరాడడం లేదు.. దేశం లోని జాత్యహంకార దాడులపై కూడా పోరాడుతోంది.

నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ మరణం ప్రపంచం మొత్తాన్ని కబళించివేసింది. నిరాయుధుడైన జార్జ్ ఫ్లాయిడ్ ను అమెరికా పోలీసులు కావాలనే చంపేశారని పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' పేరుతో ప్రపంచం మొత్తం ఈ దారుణంపై ఒక్కటైంది. అమెరికాలో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని నిరసన కార్యక్రమాలు హింసాత్మక ఘటనలకు కూడా దారి తీశాయి.

సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ వ్యక్తిని చుట్టుముట్టిన పోలీసులు రోడ్డు మీదనే చితకబాదారు. ఒకరి తర్వాత మరొకరు అతడిని ఇష్టం వచ్చినట్లు కొట్టి ముందుకు వెళ్లిపోయారు. ఇంతలో పోలీసు వాహనాలు రాగా.. అందులో నుండి దిగిన మరికొందరు.. అతడిని రోడ్డు మీద నుండి పక్కన ఫుట్ పాత్ మీద పక్కన పెట్టేసి వెళ్లిపోయారు. @Andy_Resist అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు. “I really can’t find the good police.” అంటూ వీడియో గురించి రాసుకుని వచ్చారు.



80000 మంది ఫాలోవర్లు ఉన్న నటుడు ఆండీ ఆస్ట్రాయ్ (Andy Ostroy) కూడా ఈ వీడియోను పోస్టు చేశారు. “Anyone who can’t understand how Hitler got his citizens to commit atrocities…and think it can’t happen here…just watch. This is some seriously terrifying police brutality that 6 months from now could be a whole lot worse” అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ స్థాయిలో పోలీసుల అరాచకాలు చూడలేదని ఆయన అభిప్రాయపడ్డారు.



చాలా మంది ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుందని వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.

నిజ నిర్ధారణ:

ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుందన్నది "పచ్చి అబద్ధం".

ఈ వీడియో కింద ఉన్న కామెంట్లలో చాలా మంది ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకోలేదని 'సెర్బియా' లో చోటుచేసుకున్న ఘటన అని చెప్పుకొచ్చారు.

వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడమే కాకుండా, సెర్బియా ప్రొటెస్ట్స్ (‘Serbia protests’) అన్న కీవర్డ్స్ ను కూడా ఉపయోగించి చూడగా.. ఈ వీడియో సెర్బియాకు చెందినదని తేలింది.

సెర్బియా లోని బెల్గ్రేడ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సెర్బియా ప్రెసిడెంట్ అలెక్జాండర్ వుకిక్ జులై 7న 59 గంటల పాటూ లాక్ డౌన్ ను అనౌన్స్ చేశారు. ఆ సమయంలో వేలమంది ప్రజలు నేషనల్ అసెంబ్లీ ముందుకు వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు.

europeanwesternbalkans.com కథనం ప్రకారం నిరసనకారులు పార్లమెంట్ లోకి వెళ్లాలని భావించారు. ఆ సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేసి ముందుకు దూసుకువెళ్లాలని భావించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడానికి గ్యాస్ బాంబులు వేయడమే కాకుండా, పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులు మరింత రెచ్చిపోయారు కూడానూ.. అప్పుడే పోలీసులు కొందరిని చితకబాదారు. ఈ ఘటనలను చూసిన సెర్బియా ప్రెసిడెంట్ తన లాక్ డౌన్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.

https://www.nytimes.com/2020/07/05/us/chicago-shootings.html

https://www.bloomberg.com/news/articles/2020-07-07/serbs-plan-to-reimpose-virus-curfew-in-capital-as-new-cases-rise

https://www.newsweek.com/police-throw-black-lives-matter-protester-out-wheelchair-then-break-it-viral-video-1518381

నిరసనకారులను అమెరికా పోలీసులు చితకబాదారన్న ఈ పోస్టు 'పచ్చి అబద్ధం'.

Next Story